ఆ హీరోయిన్‌తోనే ఇబ్బంది.. అందుకే చివాట్లు పెట్టా.. నాగార్జున
ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమను తన అందం, అభినయంతో ఒక ఊపారు శ్రీయా శరణ్. సౌత్‌లోని టాప్ స్టార్స్‌తో పాటు యంగ్ హీరోల సరసన నటించి ఆకట్టుకున్నారు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన శ్రీయ.. ఆపై సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇష్టం సినిమాతో తెలుగు వారికి పరిచయమయ్యారు. ఆ మూవీ నిరాశపరిచినా.. శ్రియా మాత్రం తన క్యూట్ లుక్స్, మెస్మరైజింగ్ స్మైల్, డ్యాన్స్‌తో వరుస అవకాశాలను దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. అలాంటి శ్రీయా శరణ్‌కు ఓ స్టార్ హీరో సెట్‌లోనే క్లాస్ పీకాడట. ఆ వివరాల్లోకి వెళితే :
నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రజనీకాంత్, విక్రమ్ వంటి అగ్ర నటులందరితో ఆడిపాడారు శ్రీయ. ఓ టాప్ హీరోయిన్ మిడ్‌రేంజ్ హీరోలతో రొమాన్స్ చేయడం కష్టం. ఎంతోమంది ముద్దుగుమ్మలు.. అప్‌కమింగ్ హీరోల పక్కన నటించడానికి నో చెప్పిన వారే. కానీ శ్రీయ అలాంటి యాటిట్యూడ్ చూపించలేదు. మిడ్ రేంజ్ హీరోలతో కలిసి పనిచేసేందుకు ఏమాత్రం నో చెప్పలేదు . కథ బాగుంటే చాలు.. హీరో ఎవ్వరనేది ఆలోచించలేదు. తరుణ్, రాజా, ఉదయ్ కిరణ్, వేణు వంటి హీరోలతోనూ ఆమె నటించారు. అంతేకాదు.. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో కొత్త కుర్రాడు కౌశిక్‌కు ప్రేయసిగా నటించారంటే ఆమె ధైర్యం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

హీరోయిన్‌గా టాప్ రేంజ్‌లో ఉన్నప్పుడే .. ఐటెం సాంగ్స్ చేసి కొత్త ట్రెండ్ సెట్ చేశారు శ్రీయా శరణ్. తన డ్యాన్సింగ్ స్కిల్స్, చురకత్తుల్లాంటి చూపులతో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేసి మాస్‌ను ఒక ఊపు ఊపారు. 20 ఏళ్లకు పైగా కెరీర్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ది అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్, కుకింగ్ విత్ స్టెల్లా, మిడ్ నైట్ చిల్డ్రన్ వంటి ఇంగ్లీష్ సినిమాల్లోనూ కనిపించారు. 2018 మార్చి 12న రష్యాకు చెందిన ఆండ్రే కొశ్చీవ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు శ్రియా. ఈ దంపతులకు ఒక పాప.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రీయ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాల సంగతులు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ఇక 40 ప్లస్‌లో తన అందాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లను మించి గ్లామర్‌గా కనిపిస్తున్నారు. తెలుగు హీరోలలో అక్కినేని నాగార్జునతో క్లోజ్‌గా ఉంటారని శ్రీయకు పేరు. వీరిద్దరూ సంతోషం, నేనున్నాను, బాస్, ఊపిరి, మనం సినిమాలలో కలిసి నటించారు. అలాంటి ఫ్రెండ్‌షిప్ ఉన్నప్పటికీ శ్రీయకు నాగ్ క్లాస్ పీకారట.

ఒకప్పటి అగ్ర కథానాయిక జయప్రద కొన్నేళ్ల క్రితం జయప్రదం పేరుతో స్టార్స్‌ని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జునను కొందరి హీరోయిన్లు పేరు చెప్పి వారి గురించి అడిగింది. ఈ క్రమంలోనే మీతో పనిచేసిన హీరోయిన్లలో లేజీ ఎవరని జయప్రద ప్రశ్నించగా.. దానికి శ్రీయా అని నాగ్ ఆన్సర్ ఇచ్చారు. ఆ అమ్మాయి చాలా లేజీగా ఉంటుందని, షూటింగ్‌లకు లేట్‌గా వస్తుండటంతో తాను కూడా ఇబ్బందిపడినట్లు కింగ్ తెలిపారు. తానే పక్కన కూర్చోబెట్టుకుని సెట్‌లోనే చాలా సార్లు క్లాస్ పీకానని నాగార్జున వెల్లడించారు. ప్రస్తుతం నాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











