మరోసారి హోస్ట్‌గా సమంత.. స్టార్ సెలబ్రెటీలతో అంతకు మించి!

సినిమా ఇండస్ట్రీలో సినీ తారల ఆలోచనలు, వేసే అడుగులు చాలానే మారుతున్నాయి. డిజిటల్ మీడియా రాకతో వెబ్ సిరీస్ లతో ప్రయోగాయాలు చేయడమే కాకుండా వినోదాత్మకమైన షోలతో కూడా అలరిస్తున్నారు. బిగ్ బాస్ తో ఇప్పటికే ముగ్గురు స్టార్ హీరోలు హోస్ట్ గా వారి టాలెంట్ ఏంటో నిరూపించారు. ఇక సమంత కూడా భవిష్యత్తు కెరీర్ కి మరో బాట కూడా రేడి చేసుకున్నట్లు చాలా ఈజీగా అర్ధమయ్యింది. మొత్తానికి బిగ్ బాస్ ఆమెకు చాలా హెల్ప్ అయ్యింది.

మరోసారి హోస్ట్ గా సమంత

మరోసారి హోస్ట్ గా సమంత

అసలు మ్యాటర్ లోకి వెళితే సమంత మరోసారి హోస్ట్ గా ఆకట్టుకోబోతోంది. బిగ్ బాస్ లో ఆమె ఏ విధంగా ఆకట్టుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. షోను రెగ్యులర్ గా ఫాలో అవ్వకపోయినా కూడా కంటెస్టెంట్స్ తో ఆమె కొనసాగిన విధానం ఆడియెన్స్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. మరో రెండు ఎపిసోడ్స్ చేస్తే బావుంటుందని అనిపించింది గాని ఆమె ఎందుకో కొనసాగలేదు మరి. ఇక బిగ్ బాస్ అందించిన ఉత్సాహంతో ఆమె మరో ప్రయోగానికి సిద్ధమైంది.

అనిపించేది ఎవరు?

అనిపించేది ఎవరు?

ప్రముఖ తెలుగు డిజిటల్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఆహా యాప్ లో సమంత ఒక టాక్ షోను స్టార్ట్ చేయబోతోంది. రానా నెంబర్ వన్ యారీ తరహాలో ఉంటుందని సమాచారం. *అనిపించేది ఎవరు* అనే ఆ షోలో టాలీవుడ్ కి చెందిన సెలబ్రెటీలు గెస్టులుగా వస్తారట. వాళ్ళను సరదాగా ఆటపట్టించే టాస్క్ లతో సమంత సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్ ఆహా యాప్..

అల్లు అరవింద్ ఆహా యాప్..

అల్లు అరవింద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆహా యాప్ ప్రస్తుతం బాగానే క్రేజ్ అందుకుంటోంది. ఇటీవల కలర్ ఫోటో సినిమాతో పాటు మరికొన్ని వెబ్ సిరీస్ లు ఆహా అనిపించాయి. ఇక సమంత లాంటి స్టార్ హీరోయిన్ వస్తే ఇంకా వీక్షకులు పెరుగుతారని అల్లు అరవింద్ ప్లాన్ చేసినట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని సమంత మాత్రం హోస్ట్ గా రెడీ అయినట్లు తెలుస్తోంది.

సమంత బిగ్ బాస్ సక్సెస్

సమంత బిగ్ బాస్ సక్సెస్


బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించిన తరువాత సమంత మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుందని అనుకుంటే ఎవరు ఊహించని విధంగా యూ టర్న్ తీసుకుంది. ఆమెలో హోస్ట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని అర్ధమయ్యింది. ఆమె పండగ రోజు బిగ్ బాస్ లో చేసిన సందడి ఎంతగా సక్సెస్ అయ్యిందో వచ్చిన రేటింగ్ ని బట్టి అర్ధమయ్యింది. మరి ఆహా యాప్ షోతో అక్కినేని వారి కోడలు ఇంకా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X