twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి అంటే చచ్చేంత ప్రేమ.. సైరా రిలీజ్‌కు ముందు ఏం చేసిందంటే

    |

    స్వయంకృషితో సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా మారిన చిరంజీవి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకొన్నారు. తెర మీద ఆయన నటనా విన్యాసం చూసి ఫ్యాన్స్ కొందరైతే.. రక్తదానం చేసి సోదరులైన వారు మరికొందరు ఉన్నారు. సినిమా తారలు కూడా ఆయనకు అభిమానులుగా ఉన్నారు. అలాంటి క్రేజీ అభిమాని గురించి తీసిన సినిమా గురించి మీరే తెలుసుకొండి..

    సురభి 70ఎంఎంలో

    సురభి 70ఎంఎంలో

    చిరంజీవి సూపర్ హిట్ సినిమా 'అభిలాష' ఆ అమ్మాయి పేరు. మరో సూపర్ హిట్ సినిమా 'గ్యాంగ్ లీడర్' ఆమె క్యారక్టర్. ఇక మెగా స్టార్ చిరంజీవి అంటే అభిలాషకు ఎంత పిచ్చి అంటే.. 'జై చిరంజీవా' అంటూ చేతికి పచ్చ బొట్టు పొడిపించుకునేంత. ఇంతకీ ఈ అభిలాష కథేంటి? చిరంజీవి కోసం చచ్చిపోయేంతగా పెంచుకున్న మెగాభిమానం ఆమెకు చేసిన మేలేంటి? 'గ్యాంగ్ లీడర్' గా ఆమె ఎందుకు మారాల్సి వచ్చింది? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. 'సురభి 70 ఎం.ఎం' చూడాల్సిందే అని దర్శకనిర్మాత వై.గంగాధర్ అంటున్నారు

    మెగా ఫ్యాన్స్ రచ్చ

    మెగా ఫ్యాన్స్ రచ్చ

    మెగా ఫ్యాన్ గా అందాల భామ అక్షత శ్రీనివాస్ నటిస్తున్న 'సురభి 70 ఎం.ఎం' చిత్రాన్ని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి పిక్చర్స్-అద్వైత పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువ ప్రతిభాశాలి వై.గంగాధర్ సొంత నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్నారు. 'సురభి 70 ఎం.ఎం' అనే ధియేటర్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే ఓ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అక్షత శ్రీనివాస్ తన గ్యాంగ్ తో ఎలా ప్రతిఘటించింది? ఆ క్రమంలో ఆమె 'గ్యాంగ్ లీడర్' ఎలా అయ్యింది? వంటి ఆసక్తికర విషయాలు వెండి తెరపై చూడాల్సిందే అంటున్నారు దర్సకనిర్మాత వై.గంగాధర్. మెగా ఫ్యాన్స్ రచ్చ
    మెగా ఫ్యాన్ గా అందాల భామ అక్షత శ్రీనివాస్ నటిస్తున్న 'సురభి 70 ఎం.ఎం' చిత్రాన్ని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి పిక్చర్స్-అద్వైత పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యువ ప్రతిభాశాలి వై.గంగాధర్ సొంత నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్నారు. 'సురభి 70 ఎం.ఎం' అనే ధియేటర్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే ఓ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అక్షత శ్రీనివాస్ తన గ్యాంగ్ తో ఎలా ప్రతిఘటించింది? ఆ క్రమంలో ఆమె 'గ్యాంగ్ లీడర్' ఎలా అయ్యింది? వంటి ఆసక్తికర విషయాలు వెండి తెరపై చూడాల్సిందే అంటున్నారు దర్సకనిర్మాత వై.గంగాధర్.

    నేను చిరంజీవికి అభిమానిని

    నేను చిరంజీవికి అభిమానిని

    మెగా ఫ్యాన్ అభిలాషగా నటిస్తున్న యువ కథానాయకి అక్షత శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'స్వతహా మెగా స్టార్ కు పెద్ద ఫ్యాన్ అయిన నాకు 'సురభి '70 ఎం.ఎం'లో మెగాభిమానిగా గ్లామర్ తోపాటు నటనకు ప్రాధాన్యత కల 'అభిలాష' అనే పాత్రలో 'లేడి గ్యాంగ్ లీడర్'గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందుకుగాను మా దర్శకనిర్మాత గంగాధర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

    సురభి 70ఎంఎం చిత్రం

    సురభి 70ఎంఎం చిత్రం

    సురభి 70 ఎంఎం చిత్రం నా కెరీర్ ను మలుపు తిప్పుతుందని నమ్మకంగా చెప్పగలను. మా బాస్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన 'సైరా' సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు!. అక్టోబర్ 2 తేదీన విడుదల అవుతున్న సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అని అక్షత శ్రీనివాస్ అన్నారు.

    English summary
    Actor Akshata Srinivas's latest movie is Surabhi 70mm movie. She is a acting as Chiranjeevi fan's role. In this occassion, She revealed her happiness about role of Surabhi 70mm.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X