సూపర్‌స్టార్ కొడుకుని 6 ఏళ్లు వెంటాడిన హీరోయిన్... బిడ్డని అలా కాపాడుకున్న నటుడు

అక్షయ్ కుమార్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ సూపర్‌స్టార్‌గా, యాక్షన్ హీరోగా దశాబ్ధాలుగా వెలుగొందుతున్నారు అక్షయ్. ఖాన్ త్రయాన్ని, కపూర్ ఫ్యామిలీకి గట్టి పోటీ ఇస్తూ నేటికీ బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరిగా, హిందీ పరిశ్రమలో ఐకాన్‌గా దూసుకెళ్తున్నారు అక్షయ్. 60 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలతో సమానంగా అదే ఎనర్జీతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఏడాదికి కనీసం నాలుగైదు, సినిమాలు రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా ఏప్రిల్ 17న విడుదలైంది.

హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు అక్షయ్ కుమార్. పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ యాక్షన్ హీరో.. ఓ ప్రణాళిక ప్రకారం జీవితాన్ని గడుపుతున్నారు. ఒకప్పుడు చెఫ్‌గా పనిచేసిన ఆయన ఇప్పుడు సూపర్‌స్టార్‌గా, భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా ప్రత్యేకత చాటుకున్నారు. 1991లో సౌగంథ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత లవ్ స్టోరీలు, ఫ్యామిలీ సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే తనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలనే ఉద్దేశంతో యాక్షన్ సినిమాల వైపు మొగ్గుచూపారు. 35 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విలక్షణ సినిమాలు, పాత్రలు పోషించారు. ఎక్కువగా పోలీస్, ఆర్మీ ఆఫీసర్ల పాత్రలు పోషించారు.

Akshay Kumar Reveals Son Aarav Kumar Was Scared of Vidya Balan s Manjulika Role in Bhool Bhulaiyaa

ప్రస్తుతం వెల్‌కం టూ ది జంగీల్, హైవాన్, యూనైటెడ్ ఫిల్మ్, గోల్‌మాల్ 5 సినిమాలలో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్ లెజెండరీ నటుడు రాజేష్ ఖన్నా కుమార్తె ట్వింకిల్ ఖన్నాను 2001లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు ఆరవ్, కుమార్తె నిటారా సంతానం. ప్రస్తుతం భూత్ బంగ్లా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో అక్షయ్ బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తను నటించిన భూల్ భులయ్య సినిమా నా కొడుకు ఆరవ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన విద్యాబాలన్‌ని చూసి భయపడేవాడు. ఆమె మా ఇంటికి వస్తుందంటే చాలు వణికిపోయేవాడు, కనీసం కళ్లలో కళ్లుపెట్టి చూసేవాడు కాదు. దాంతో నేను ఆరవ్‌ని దగ్గరికి తీసుకుని, ఆమె మంజులిక (భూల్ భులయ్యలో విద్యాబాలన్ పాత్ర పేరు) కాదని విద్యాబాలన్ అని చాలా మంచిదని ఓదార్చేవాడిని. అయినప్పటికీ దాదాపు ఆరేళ్లపాటు నా కొడుకును మంజులిక పాత్ర వెంటాడింది. పెరిగి పెద్దయిన తర్వాత వాడిలో మార్పు వచ్చిందని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా.. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన భూల్ భులయ్య సినిమాలో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, అమీషా పటేల్, పరేష్ రావల్, అస్రానీ తదితరులు నటించారు. హార్రర్, సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమింట్స్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను భయపెట్టింది. ముఖ్యంగా మంజులికగా విద్యాబాలన్ అద్భుతంగా నటించారు. కళ్లతోనే భయపెట్టి జనాన్ని వణికించారు. 2007 అక్టోబర్ 12న విడుదలన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 82 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X