అక్కడికి వెళ్లాలంటే భయమేసేది.. రణ్‌వీర్‌తో హ్యాపీగా.. ఆలియాభట్
బాలీవుడ్ అందాల తార అలియాభట్ సినీ కెరీర్ ఆరంభించి అప్పుడే ఏడేళ్లు గడిచాయి. ఇప్పటి వరకు అందంతోనే కాకుండా అభినయంతో మెప్పించారు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను పట్టించుకోకుండా తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకొంటూ ప్రేక్షకాదరణను మూటగట్టారు. హైవే, రాజీ చిత్రాలు ఆమె నటనాప్రతిభకు అద్దం పట్టాయి. తాజాగా రణ్‌వీర్ సింగ్‌తో కలిసి గల్లీబాయ్ అనే చిత్రంలో నటించారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. గల్లీబాయ్ ఓ వ్యక్తి జీవిత ప్రయాణం అని చెప్పవచ్చు అన్నారు. ఉడ్తా పంజాబ్ సినిమాతో పోలీక ఉండదు. ఈ చిత్రంలోని పాత్ర చాలా సున్నితమైంది. వాస్తవ జీవితంలో మాదిరిగానే నేను ధైర్యవంతురాలినే కాకపోతే మానసికంగా చాలా శక్తిమంతురాలిని అని అలియాభట్ అన్నారు.

నేను ఎంచుకొన్న కథలు విజయ సాధించడం వల్ల పెద్దగా నాపై ఒత్తిడి పెరుగలేదు. అందుకే నాకు నచ్చిన పాత్రలే నేను చేస్తున్నాను. నా ముందుకు మంచి కథలు వస్తే తప్పకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాను అని అలియాభట్ చెప్పారు. గల్లీబాయ్ చిత్రంలో నేను సఫీనా అనే పాత్రలో కనిపిస్తాను. ఆరంభంలో సెట్స్‌కు వెళ్లాలంటే భయమేసేంది. గల్లీబాయ్ విషయానికి వస్తే రణ్‌వీర్ ఫన్నీ వ్యక్తి కావడంతో హ్యాపీగా షూటింగ్ గడిచిపోయింది.


Click it and Unblock the Notifications











