విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదే.. ఆమె కూడా అతడి పేరే

అతి తక్కువ కాలంలో ఎవరికీ దక్కని క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. కేవలం సినిమాలు హిట్ కావడం వల్లే వచ్చిన క్రేజ్ కాదిది. తెరపై విజయ్ ఎలా కనిపించినా.. తెర వెనుక విజయ్ యాటిట్యూడ్, ప్రవర్తన, స్టేజ్‌ ఎక్కితే మాట్లాడే విధానం, అందరిలోకెల్లా భిన్నంగా కనపడటం ఇలా ప్రతీ ఒక్కటి విజయ్ దేవరకొండను ప్రత్యేకంగా నిలిచేలా చేశాయి. అందుకే సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

చివరగా వచ్చిన డియర్ కామ్రేడ్.. మిశ్రమ ఫలితాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో దక్షిణాది మొత్తాన్ని హస్తగతం చేసుకుందామనుకున్న విజయ్‌కు నిరాశే మిగిలింది. అయినా మనోడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విజయ్ క్రేజ్ కేవలం టాలీవుడ్, కోలీవుడ్ అని అనుకుంటే పొరబాటే. ఒక్క హిందీ చిత్రాన్ని చేయకపోయినా, కనీసం డబ్బింగ్ రూపంలోనైనా పలకరించకోయినా విజయ్ పేరు బీటౌన్‌లో మార్మోగిపోతూ ఉంటుంది. స్టార్ హీరోలకు దక్కని గౌరవం విజయ్‌కు దక్కుతుంది.

 Alia Bhatt About Vijay Devarakonda

ఈమధ్య ఫిలింఫేర్ వారు ముంబై లో గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2019 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యకమంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా తళుక్కున మెరిసింది. దీంతో అక్కడ మీడియా వారు అలియా ను సందర్భానికి తగ్గట్టు ఒక మంచి ప్రశ్న అడిగారు. "పోయినేడాదిలో మోస్ట్ గ్లామరస్ యాక్టర్.. యాక్ట్రెస్ ఎవరు?" అనేదే ఆ ప్రశ్న. ఎక్కువ ఆలోచించకుండా "అనుష్క శర్మ.. నాకు ఆల్ టైమ్ ఫేవరేట్ యాక్ట్రెస్.. ఇంకా విజయ్ దేవరకొండ.. అతనిది అమేజింగ్ స్టైల్" అంటూ తన స్టైల్‌లో జవాబిచ్చింది.

ఆ మధ్య జాన్వీ కపూర్, కియారా అద్వాణీ లాంటి వారు సైతం తమకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని, అతనితో కలిసి నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతా రామ రాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్‌కు జోడిగా సీత పాత్రలో అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X