twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘RRR’ హీరోయిన్‌కు అరుదైన గౌరవం, మోస్ట్ డిజైరబుల్ ఉమెన్!

    |

    మొత్తం 50 మందితో కూడిన ఈ జాబితాలో అలియా... కత్రినా కైఫ్, దీపిక పదుకోన్ లాంటి అందగత్తెలను, స్టార్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టివేయడం గమనార్హం. అలియా భట్ తర్వాతి స్థానాల్లో మీనాక్షి చౌదరి, కత్రినా కైఫ్, దీపిక పదుకోన్, గాయిత్రి భరద్వాజ్, అదితి రావు హైదరి, నెహాల్ చుడాసమా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ, అనుక్రీతి టాప్ 10 లిస్టులో ఉన్నారు.

    టీనేజీలోనే నటిగా తన ప్రస్తానం మొదలు పెట్టిన అలియా భట్ 26 ఏళ్ల వయసు వచ్చే సరికి నటనలో ఆరితేరారు. తన యాక్టింగ్ స్కిల్స్‌తో విమర్శకులను సైతం అబ్బుర పరిచారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన తారగా అవతరించారు. అందం, టాలెంట్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ కలిసి ఆమెను టాప్ పొజిషన్లో నిలబెట్టాయి.

     Alia Bhatt bagged Times Most Desirable Woman 2018 title

    అలియా భట్ ఈ దేశంలో చాలా మంది కుర్రాళ్లకు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అయుండొచ్చు కానీ... ఆమెకు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ మాత్రం ప్రియుడు రణబీర్ కపూర్. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తులు వినిపిస్తున్నాయి.

    సినిమాల విషయానికొస్తే... రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్' మూవీలో హీరోయిన్‌గా ఎంపికైంది అలియా. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్‌కు జోడీగా అలియా భట్ నటించబోతోంది. ఈ సినిమాతో పాటు బ్రహ్మాస్త్ర, సడక్ 2 చిత్రాల్లో నటిస్తోంది.

    English summary
    Bollywood Actress Alia Bhatt has been crowned with The Times Most Desirable Woman 2018 title. Alia beat popular actresses like Katrina Kaif, Deepika Padukone and several others among the top 50 female celebrities to win the title.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X