Don't Miss!
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘RRR’ హీరోయిన్‌కు అరుదైన గౌరవం, మోస్ట్ డిజైరబుల్ ఉమెన్!
మొత్తం 50 మందితో కూడిన ఈ జాబితాలో అలియా... కత్రినా కైఫ్, దీపిక పదుకోన్ లాంటి అందగత్తెలను, స్టార్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టివేయడం గమనార్హం. అలియా భట్ తర్వాతి స్థానాల్లో మీనాక్షి చౌదరి, కత్రినా కైఫ్, దీపిక పదుకోన్, గాయిత్రి భరద్వాజ్, అదితి రావు హైదరి, నెహాల్ చుడాసమా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దిశా పటానీ, అనుక్రీతి టాప్ 10 లిస్టులో ఉన్నారు.
టీనేజీలోనే నటిగా తన ప్రస్తానం మొదలు పెట్టిన అలియా భట్ 26 ఏళ్ల వయసు వచ్చే సరికి నటనలో ఆరితేరారు. తన యాక్టింగ్ స్కిల్స్‌తో విమర్శకులను సైతం అబ్బుర పరిచారు. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన తారగా అవతరించారు. అందం, టాలెంట్, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ కలిసి ఆమెను టాప్ పొజిషన్లో నిలబెట్టాయి.
అలియా భట్ ఈ దేశంలో చాలా మంది కుర్రాళ్లకు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అయుండొచ్చు కానీ... ఆమెకు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ మాత్రం ప్రియుడు రణబీర్ కపూర్. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తులు వినిపిస్తున్నాయి.
సినిమాల విషయానికొస్తే... రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్' మూవీలో హీరోయిన్గా ఎంపికైంది అలియా. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్‌కు జోడీగా అలియా భట్ నటించబోతోంది. ఈ సినిమాతో పాటు బ్రహ్మాస్త్ర, సడక్ 2 చిత్రాల్లో నటిస్తోంది.