రోజుకు కోటి రెమ్యూనరేషన్ .. పెళ్ళై పిల్లలు ఉన్నా డిమాండ్ తగ్గని హీరోయిన్ ఎవరంటే?
సినీ ఇండస్ట్రీలో హీరోలే కాదు.. హీరోయిన్ల హావా కూడా కొనసాగుతోంది. టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతున్నాయి. రెమ్యూనరేషన్ విషయంలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. కోట్లాది రూపాయాలను వసూలు చేస్తున్నారు. ఓ హీరోయిన్ ఒక రోజు నటించడానికి ఓ బ్యూటీ కోటీ రూపాయలు వసూలు చేస్తోందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?
ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు. బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అలియా భట్ (Alia Bhatt). ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ మహేష్ భట్ గారాల పట్టికా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో చిత్రసీమలోకి పరిచయం అయ్యింది. ఈ భామ తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసి.. బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. అలియా.. పెళ్లై ఓ పాపకు జన్మనిచ్చింది. అయినా.. ఈ అమ్మడు గ్లామర్ తగ్గలేదు. ఇప్పటికీ ఈ బ్యూటీ కుర్రాళ్ల ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్.

ఈ అమ్మడు తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి, మంచి గుర్తింపు వచ్చింది. మొదటి సినిమాతోనే ఈ క్యూటీ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. రామ్ చరణ్‌కు ప్రేయసిగా సీత పాత్రలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకుందిఅయితే.. ఈ సినిమాకు కేవలం 10 రోజలు మాత్రమే పనిచేసిందట. అయితే 10 రోజుల షూటింగ్ చేసినందుకు ఏకంగా 9 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. అంతకు ముందు గంగూభాయి కతియావాడి సినిమాలో నటించి.. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకుపోతోంది. దీంతో పెళ్లై .. పిల్లలు పుట్టిన ఈ అమ్మడు క్రేజ్ తగ్గలేదుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల వివరాల్లోకెళ్తే.. దీపికా పదుకొనే నుండి కరీనా కపూర్ వరకు చాలా మంది హీరోయిన్స్ కోట్లల్లో పారితోషికం తీసుకుంటున్నారు. బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం.. దీపికా పదుకొణే ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు దాదాపు 15 నుంచి 20 కోట్లు తీసుకుంటుంది. దీపిక చివరిగా 'కల్కి 2898 AD'లో కనిపించింది. దీనికి ముందు.. షారుక్ ఖాన్‌తో కలిసి పఠాన్, జవాన్'లో కనిపించింది.

ఈ జాబితాలో రణబీర్ కపూర్ భార్య అలియా భట్ రెండో స్థానంలో నిలిచింది. మీడియా కథనాల ప్రకారం.. అలియా ఒక్కొక్క సినిమాకు దాదాపు 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందట. 'గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్ సినిమాలతో పాపులర్టీ సొంతం చేసుకుంది. ఆలియా తర్వాత మూడో స్థానంలో కరీనా కపూర్ నిలిచారు. మీడియా కథనాల ప్రకారం. కరీనా ఒక్కొక్క సినిమాకు దాదాపు 8 నుండి 11 కోట్లు తీసుకుంటుంది. కరీనా ఇటీవల 'క్రూ' చిత్రంలో కనిపించింది.
అంతకుముందు 'జానే జాన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇతర హీరోయిన్ల గురించి చెప్పాలంటే.. కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్ కూడా భారీ మొత్తంతో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారే.. వీరు ఒక్కో సినిమాకు దాదాపు 8 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నారు. కృతి సనన్, కియారా అద్వానీ, కంగనా రనౌత్ లు ఒక చిత్రానికి 5 నుండి 8 కోట్లు వసూలు చేస్తారు.


Click it and Unblock the Notifications











