ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాపై క్లారిటీ ఇచ్చేసిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆమెను కాదని..
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా దర్శకత్వంలో తన 30వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. జనతా గ్యారేజ్ సినిమా అనంతరం వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకోసం జూనియర్ ఎన్టీఆర్ ఫిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు గా తెలుస్తోంది. ఇక ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది.
Recommended Video

ఏ మాత్రం తగ్గకుండా..
ఎన్టీఆర్ తో కొరటాల శివ కూడా మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ 30వ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్న తరుణంలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

మొదట ఆ హీరోయిన్ అని..
దర్శకుడు కొరటాల శివ ఒక బాలీవుడ్ హీరోయిన్ ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లుగా చాలా రకాల వార్తలు వచ్చాయి. మొదట కీయరా అద్వానీ ని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు ఆ తర్వాత తన ఆలోచనలను మార్చుకుని ఆలియా భట్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయంలో ఎవరు సరైన క్లారిటీ అయితే ఇవ్వలేకపోయారు.

క్లారిటీ ఇచ్చిన అలియా..
ఇక ఇటీవల ఆలియా భట్ ఆ విషయంపై అధికారికంగా వివరణ ఇవ్వడంతో అభిమానులకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. కొరటాల శివ ఇదివరకే తనకు ఎన్టీఆర్ కు సంబంధించిన ప్రాజెక్టు గురించి చెప్పినట్లుగా ఆమె తెలియజేశారు. ముంబైలో గంగుబాయ్ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన అలియా భట్ తన తదుపరి సినిమా గురించి కూడా వివరణ ఇచ్చింది.

ఆ తరువాత ఎన్టీఆర్ తోనే..
అయితే RRR తర్వాత ఎన్టీఆర్తో తన తదుపరి సినిమా ఉంటుంది అని ఆమె వివరణ ఇచ్చింది. స్క్రిప్ట్ గురించి కొరటాల ఇదివరకే చెప్పారని అందులో నటించడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా కూడా వివరణ ఇచ్చారు. ఇక ఇదివరకే అలియా రామ్ చరణ్ కు జోడీగా RRR లో సీత పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం కానుందని కూడా తెలియజేశారు.

ఎన్టీఆర్ తో ఎమోషనల్ సీన్స్
అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కు అలియా భట్ కు సంబంధించిన సన్నివేశాలు కూడా RRR సినిమాలో చాలా విభిన్నంగా ఉంటాయట. ముఖ్యంగా ఎమోషనల్ గా సాగే కొన్ని ఎపిసోడ్స్ లో కూడా అలియా నటన అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఆమె రానున్న రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లుగా మరోసారి క్లారిటీ వచ్చేసింది.

మ్యూజిక్ డైరెక్టర్ కూడా..
మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న 30 సినిమాపై చేయబోతున్నట్లు అలియా భట్ అధికారికంగా వివరణ ఇచ్చింది. ఇక ఈ సినిమాతో ఆమె స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఎన్టీఆర్ 30వ సినిమా కోసం సంగీత దర్శకుడు కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు అందుకుంటున్న అనిరుధ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం


Click it and Unblock the Notifications











