రాజమౌళి ప్రయత్నాలు ఫెయిల్... డబ్బు మనిషిని కాదంటూ హీరోయిన్ సందేశం?
Recommended Video

రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో 'ఆర్ఆర్ఆర్' అనే భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్న బాహుబలి డైరెక్టర్ రాజమౌళి... అలియా భట్‌ను ఈ ప్రాజెక్టులోకి లాగాలని చాలా ప్రయత్నిస్తున్నారని, ఆమెకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరు హీరోల్లో రామ్ చరణ్ సరసన ఆమె అయితే బావుంటుందని రాజమౌళి భావిస్తున్నారని, ఆమె టాలెంట్, అందం తన సినిమాకు మరింత ప్లస్ అవుతుందని జక్కన బలంగా నమ్ముతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రాజమౌళి ఆఫర్‌కు నో చెప్పిన అలియా భట్
అయితే తాజాగా ఈ అంశంపై ఓ ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది. అలియా భట్... రాజమౌళి ఆఫర్ తిరస్కరించినట్లు సమాచారం. ఈ సంవత్సరం మొత్తం ఆమె కాల్షీట్లు ఏవీ ఖాళీ లేవని, అందుకే నో చెప్పినట్లు తెలుస్తోంది.

రెమ్యూనరేషన్ మ్యాటర్ కానేకాదు
అయితే రెమ్యూనరేషన్ భారీగా ఆఫర్ చేయడంపై కూడా అలియా భట్ వారికి రిటర్న్ సందేశం పంపినట్లు తెలుస్తోంది. కేవలం రెమ్యూనరేషన్ గురించి తాను ఈ ప్రాజెక్ట్ సైన్ చయడం లేదనే అంశంలో నిజం లేదని, ముందే కమిటైన ప్రాజెక్టులు ఉండటం వల్లే మీ ఆఫర్ స్వీకరించలేక పోతున్నట్లు స్పష్టం చేశారట.

అలియా భట్ బిజీ బిజీ
అసలు అలియా భట్‌కు సమయం లేదని, తన ‘కలంక్' చిత్రం ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉంది, దీని తర్వాత ‘సడక్ 2' షూటింగ్ ఉంది, ఆ వెంటనే ‘థక్త్' మూవీ షూటింగ్ ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారు. దీంతో పాటు అశ్వినీ ఐయ్యర్ తివారీ ప్రాజెక్టు గురించి కూడా చాలా రోజుల నుంచి డిస్ర్కషన్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్
అలియా భట్ నిర్ణయంతో రాజమౌళి అండ్ టీమ్ ‘ఆర్ఆర్ఆర్' మూవీకి హీరోయిన్ల ఎంపిక విషయంలో మరింత అలర్ట్ అయ్యారు. త్వరలో కోల్‌కతా షెడ్యూల్ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఆలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. కోల్‌కతాలో 45 రోజుల పాటు ‘ఆర్ఆర్ఆర్' షూటింగ్ జరుగబోతోంది. ప్రముఖ నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











