Met Gala 2024 మెట్ గాలా 2024లో మెరిసిన అలియా... ఈసారి థీమ్ ఏంటో తెలుసా?

ప్రస్తుతం మెట్ గాలా 2024 ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. ఈ వేదికపై ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన పలువురు సెలబ్రిటీలు హొయలు పోతున్నారు. రెడ్ కార్పెట్ పై ఫోజులిస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. అందులో భాగంగానే ఈవెంట్లో ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతగా నటించిన అలియా భట్ ఎంతో అందంగా ముస్తాబై దర్శనం ఇచ్చింది. ఈవెంట్ లో అలియా భట్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మరి ఆమె ధరించిన చీర విశేషాలపై లుక్కేద్దాం పదండి.

తాజాగా మెట్ గాలా ఈవెంట్ లో అలియా భట్ స్టన్నింగ్ లుక్ తో సెలబ్రిటీలు అందరినీ మైమరిచిపోయేలా చేసింది. బ్యూటిఫుల్ ఫ్లవర్ శారీలో షోల్డర్ లెస్ జాకెట్ ధరించి అందమైన స్మైల్ ఇస్తూ కనిపించింది. తాజాగా అలియా ఆ ఫోటోలను షేర్ చేయరా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Alia bhatt in saree looks gorgeous at Met Gala 2024 Event

ఇక ఈ చీర డిజైనర్ విషయానికి వస్తే... భారతదేశంలోని అత్యంత పాపులర్ డిజైనర్ అయిన సబ్యసాచి ముఖర్జీ రూపొందించిన శారీ ఇది. ఈ అద్భుతాన్ని రెడీ చేయడానికి 163 మంది కళాకారులు కష్టపడాల్సి వచ్చింది. వాళ్ళు ఏకంగా 1,905 గంటలు ఈ శారీని డిజైన్ చేయడానికి పని చేశారని సమాచారం.

ఓ ఇంటర్వ్యూలో అలియా ఈ శారీ గురించిన ఇంట్రెస్టింగ్ వివరాలను వెల్లడించింది. చీర మొత్తం పూల డిజైన్లతో చేతితో తయారు చేసిన ఎంబ్రాయిడరీని కలిగి ఉంది. ఆ చీరకు రఫ్ఫ్డ్ స్లీవ్‌లతో సీతాకోకచిలుక బ్లౌజ్ ను ధరించింది అలియా. ఈ లుక్ చూస్తుంటే అలియా ఒక బిడ్డకు తల్లి అని అనుకోవడం కష్టమే.

మొత్తానికి అందరి దృష్టి ఈ శారీ వల్ల అలియా పైనే పడింది. ఇక ఇలాంటి ఇంటర్నేషనల్ వేదికలపై మన సెలబ్రిటీలు చీరలో మెరవడం అనేది భారతీయులకు గర్వకారణం అని చెప్పొచ్చు. మెట్ గాలాలోనే కాకుండా కేన్స్ ఫిలిం ఫెస్టివల్, లాక్మే ఫ్యాషన్ వీక్ లాంటి అంతర్జాతీయ వీక్షకులు ఉండే ప్రతి చోటా మన దేశ చీరకట్టు సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారు పలువురు హీరోయిన్లు.

ఇప్పటిదాకా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ లాంటి హీరోయిన్లు చీరల్లో మెరవగా, తాజాగా అలియా భట్ వంతు వచ్చేసింది. ఇక ఈసారి మెట్ గాలా థీమ్ ఏంటంటే ది గార్డెన్ ఆఫ్ టైం. దీనికి తగ్గట్టుగానే అలియా శారీ పర్ఫెక్ట్ గా రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా మారింది.

More from Filmibeat

Read more about: alia bhatt
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X