భయంలో బాలీవుడ్ బ్యూటీ.. రాజమౌళి రమ్మంటున్నా రావట్లేదట!
మొత్తానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టాలీవుడ్ సినీ ప్రముఖులు షూటింగ్స్ కోసం ప్రత్యేక అనుమతులు అయితే తీసుకున్నారు. షూటింగ్స్ లో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అనేలా షరతులు అయితే ఉన్నాయి. ఇకపోతే అందరితో పాటే దర్శకుడు రాజమౌళి కూడా కొత్త షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. త్వరలోనే RRR షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతోంది.
సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్న రాజమౌళికి కొన్ని కీకకమైన సన్నివేశాల్ని ఎలా పూర్తి చేయాలనే ఆలోచన పెద్ద సందిగ్ధంలోనే పడేసిందట. ఇక ఈ తరుణంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కరోనా వైరస్ కారణంగా కొంచెం బయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె షూటింగ్స్ లో పాల్గొనడానికి ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపడం లేదని కూడా బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి.

RRRలో కొన్ని కీలకమైన సీన్స్ ని పూర్తి చేయాల్సి ఉంది. ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్ట్ లు అవసరం ఉంటుందట. ఆ ఎపిసోడ్స్ లో అలియా భట్ కంటిన్యూగా పాల్గొనాల్సి ఉంటుంది. అయితే కొత్త షెడ్యూల్ సెట్ చేసుకున్న తరుణంలో ఈ హాట్ బ్యూటీ కోవిడ్ 19 వల్ల సడన్ గా డ్రాప్ అవ్వనుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











