హీరోయిన్ సంపాదన చూసి షాక్: రూ. 7 కోట్ల ఇంటిని 13 కోట్లకు కొన్న వైనం!
బాలీవుడ్ నటి అలియా భట్ కొంతకాలంగా రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం నడిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో... భవిష్యత్‌లో తనకు కాబోయే వాడితో కలిసి ఉండేందుకు అలియా భట్ కొత్త ఇల్లు కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అయింది.
ముంబై జుహులోని పోష్ లొకాలిటీలో అలియా భట్.. ఓ అపార్టుమెంటులో ఫస్ట్ ఫ్లోర్ కొనుగోలు చేసిందట. అయితే ఆమె దీని కోసం చేసిన ఖర్చు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ధరకంటే రెంట్టింపు ఖర్చు పెట్టడమే ఇందుకు కారణం.

రూ. 13 కోట్లు ఖర్చు చేసిన అలియా భట్
అలియా భట్ కొనుగోలు చేసిన ఇల్లు ఖరీదు వాస్తవానికి రూ. 7.8 కోట్లు మాత్రమేనంట. అయితే ఆమె ఇందుకోసం రూ. 13 కోట్లు ఖర్చుపెట్టడం చర్చనీయాంశం అయింది. మరి ఆ ఇంటిలో అంత ప్రత్యేకత ఏముందో అంటూ అంతా నివ్వెరపోతున్నారు.

అలియా భట్ 3వ ఇల్లు...
సినిమాల్లోకి వచ్చిన తర్వాత వరుసల అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్న అలియా భట్... తన సంపాదన అంతా ఆస్తులు కొనుగోలు చేయడంలో ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటికే జుహులో రెండు ఇళ్లు కొన్న ఆమె తాజాగా 3వ ఇంటిని భారీ ధరకు దక్కించుకున్నారు.

బలపడుతున్న ప్రేమ బంధం
అలియా భట్, రణబీర్ కపూర్ తమ ప్రేమ బంధాన్ని మరింత బలపరుచుకుంటున్నారు. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ జంట సందడే కనిపిస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల నుంచి సమ్మతి కూడా లభించింది. అలియా భట్ తండ్రి మహేష్ భట్ గతంలో మీడియాతో మాట్లాడుతూ.. వీరి ప్రేమ విషయం నిజమే అని ధృవీకరించిన సంగతి తెలిసిందే.

అలియా భట్
అలియా భట్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... తన ప్రియుడు రణబీర్‌తో కలిసి ‘బ్రహ్మాస్త్ర'తో పాటు రణవీర్ సింగ్‌తో ‘గల్లీ బాయ్', కలంక్ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది ఆమె నటించిన ‘రాజి' సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











