ప్రెగ్నెన్సీపై దారుణ విమర్శలు.. ఘాటుగా స్పందించిన ఆలియా
తన తండ్రి నట వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అలియా భట్ కొద్ది రోజుల క్రితమే తల్లవుతున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె వివాహం చేసుకున్న రెండు నెలలకి గర్భవతిని అంటూ ప్రకటించడంతో ఆమె మీద పలు రకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం మీద అనేక రకాల ప్రచారాలు జరుగుతున్న ఆమె మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. కానీ తాజాగా ఈ విషయం మీద ఘాటుగా స్పందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే

అనూహ్యంగా వివాహం
నిజానికి ఆలియా భట్ రణబీర్ కపూర్ గత కొన్నేళ్ల నుంచి డేటింగ్ లో ఉన్నారు. వీరిద్దరి గురించి కూడా బాలీవుడ్ లో దాదాపు అందరికీ తెలుసు. క్యూట్ కపుల్ అంటూ కూడా వీరిద్దరి గురించి అందరూ అనుకుంటూ ఉండేవారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ ఓ రోజు అనూహ్యంగా వివాహం చేసుకున్నారు. చాలా రోజుల నుంచి వీరికి వివాహానికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఒకానొక సందర్భంలో ఎవరూ ఊహించని విధంగా పెళ్లి చేసుకుని ఫోటోలు సోషల్ మీడియాలో వదిలి అందరికీ షాక్ ఇచ్చారు.

ఎదో పెద్ద వార్త లా
అయితే పెళ్లికి ముందే ఆమె గర్భవతి అయ్యారని ఆ విషయాన్ని దాచి పెట్టడం కోసమే ఎందుకైనా మంచిదని వివాహం చేసుకున్నారని బాలీవుడ్ లో రకరకాల ప్రచారాలు అయితే జరిగాయి. ఈ నేపథ్యంలోనే తనమీద దుష్ప్రచారం చేస్తున్న వారందరికీ షాక్ ఇచ్చే విధంగా అలియా భట్ కొన్ని వ్యాఖ్యలు చేసింది, సాధారణంగా ఒక అమ్మాయి ఏం చేసినా అందరికీ ఎదో పెద్ద వార్త లాగా కనిపిస్తుంది అని ఆమె పేర్కొన్నారు.

పాయింటవుట్ చేస్తారు
ఒక అమ్మాయి ఎవరినైనా ప్రేమించినా, ఒకరితో డేటింగ్ లో ఉందని తెలిసినా ఒకవేళ తల్లి కాబోతుందని కనీసం క్రికెట్ చూడటానికి వెళ్లినా అంతెందుకు ఏదైనా హాలిడే ట్రిప్ కి వెళ్ళినా సరే ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తారని ఆమె పేర్కొన్నారు. అసలు మహిళ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఎందుకు పాయింటవుట్ చేస్తారు అంటూ ఆమె ప్రశ్నించారు.

వాటి అంతట అవే
తనది కూడా యుక్త వయసే అని అయితే మాత్రం తనకు కుటుంబం ఉన్నంత మాత్రాన ఒక బేబీ పుడితే అది నా వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అంటూ ఆమె ప్రశ్నించారు. అవి రెండు వేరువేరు విషయాలని ఆమె వెల్లడించారు. అంతేకాక ఆమె మాట్లాడుతూ కొన్ని గొప్ప విషయాలు మనం ప్లాన్ చేసుకో అవసరం లేదని వాటి అంతట అవే జరుగుతాయని చెప్పుకొచ్చారు.

అలియా భట్ ఈ ఏడాది
ఇక తాను ఎప్పుడూ తన మనసుకు నచ్చిన విషయాలే చేస్తానని పనికిమాలిన విషయాల మీద దృష్టి పెట్టకుండానే నా పని నేను చేసుకుంటూ వెళ్తానంటూ ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలియా భట్ ఈ ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ జోడిగా కనిపించింది. సీత పాత్రలో కనిపించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది ఇక ఈ ఏడాది బ్రహ్మాస్త్ర అనే సినిమాతో ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.


Click it and Unblock the Notifications











