twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ డేట్ ఎప్పుడూ మారుతూ వస్తోంది.. సీరియస్‌గా తీసుకోను: ఆలియా భట్

    |

    బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తన పెళ్లిపై వస్తున్న వార్తల పట్ల స్పందించింది. బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, తెగ షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలియా భట్ పెళ్లి కూడా ఫిక్స్ చేసేశారని, ఆమె పెళ్లి డేట్ ఇదే అని ఎన్నో వార్తలు వచ్చాయి.

    తాజాగా ఈ వార్తలపై ఆలియా భట్ ఆసక్తికరంగా రియాక్ట్ అయింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆలియా తన పెళ్లిపై వస్తున్న వార్తలను సీరియస్ గా తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. ''నా గురించి ఎప్పుడెలాంటి వార్తలు వస్తాయో నాకే తెలియదు. నెలకోసారి నా పెళ్లి తేదీ మారుస్తుంటారు. అంతేకాదు నా పెళ్లి గురించి మీడియాలో వార్తలను సీరియస్‌గా తీసుకోను. ఎందుకంటే అందులో ఎంటర్‌టైన్‌మెంట్ తప్ప ఇంకేమీ ఉండదు'' అని ఆలియా భట్ చెప్పుకొచ్చింది.

    Alia Bhatt response on her marriage Dates

    ఇక ఆలియా భట్ సినిమాల విషయానికొస్తే.. తెలుగు తెరపై RRR సినిమా ద్వారా తొలిసారి కనిపించేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆలియా నటిస్తోంది. అదేవిధంగా ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్ లో ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    As of latest news rotating on social media Alia Bhatt marriage date fixed. Now she reacted on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X