Alia Bhatt: ఎట్టకేలకు సినిమా గురించి పోస్ట్ పెట్టిన అలియా భట్ .. జక్కన్న టీమ్ పనేనా?
దేశవ్యాప్తంగా ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా గురించే చర్చ జరుగుతోంది సినిమా విడుదల అయ్యి ఐదు రోజులు అవుతున్నా సరే ఇప్పటికీ సినిమా థియేటర్లు హౌస్ ఫుల్ నడుస్తున్నాయి. అంటే సినిమాకు క్రేజ్ ఎలా ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో తన పాత్ర పరిధి తగ్గించిన కారణంగా అలియా భట్ అలిగిందని రాజమౌళిని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడమే కాక ఆ సినిమాకు సంబంధించిన అన్ని పోస్టులు డిలీట్ చేసిందని ప్రచారం జరిగింది. అయితే ఏమనుకుందో ఏమో కానీ ఆమె మళ్లీ ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్ట్ షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

రికార్డు స్థాయి కలెక్షన్లు
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం RRR మార్చి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో సూపర్ హిట్ టాక్ తో సినిమా దూసుకుపోతోంది. ఇప్పటికే దాదాపు రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిన ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తూ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే దిశగా ముందుకు వెళుతోంది.

చాలా చిన్న గా
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన సీత పాత్రలో అలియా భట్ నటించింది. నిజానికి అలియా భట్ పాత్ర చాలా పెద్దగానే ఉంటుందని అందరూ భావించారు కానీ సినిమా చూసిన తర్వాత మరో హీరోయిన్ గా నటించిన ఒలీవియా మోరిస్ పాత్ర కంటే అలియా భట్ పాత్ర చాలా చిన్న గా కనిపించింది.

అలియా ఫీలవుతుందని
ముందే కట్ చేయాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ అలియా భట్ ఫీల్ అవకుండా ఒక సాంగ్ చేయించి చివరిలో వదిలారు. అయితే ఈ పాత్ర పూర్తిస్థాయిలో ఎడిటింగ్ టేబుల్ మీద కట్ అయిపోయిందని తెలిసి అలియా ఫీలవుతుందని పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది.

ఎలాంటి పోస్టులు
దానికి తోడు విమర్శకులు కూడా అలియా భట్ ఇలాంటి పాత్ర ఎలా ఒప్పుకుంది అంటూ విమర్శలు గుప్పించడం తో ఆమె రాజమౌళి మీద కోపంగా ఉందని ప్రచారం జరిగింది. అంతే కాదు సోషల్ మీడియాలో ఆమె రాజమౌళి ఎకౌంట్లను అన్ ఫాలో చేయడమేకాక RRR కి సంబంధించి గతంలో చేసిన పోస్టులు డిలీట్ చేసింది అని కూడా ప్రచారం జరిగింది.. ఆ ప్రచారానికి తగ్గట్టే రాజమౌళిని ఆమె ఫాలో అవుతున్నట్లు కనిపించలేదు సరికదా 2022 వ సంవత్సరంలో RRR సినిమా ప్రమోషన్ కి సంబంధించి ఎలాంటి పోస్టులు ఆమె పెట్టలేదు.

ఇంకా ఏదైనా పోస్ట్
గతంలో పెట్టిన పోస్టులు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. అయితే ఈ విషయం తెలుగు మీడియాలో మొదలై జాతీయ మీడియా స్థాయికి పాకిన నేపథ్యంలో ఇక తప్పదు అనుకుందో లేక జక్కన టీమ్ రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించే ప్రయత్నం చేసి ఆమె చేత పెట్టిందో తెలియదు కానీ ఆమె సినిమా హిందీలో 100 కోట్ల కలెక్షన్లు సాధించిన పోస్టర్ను తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ అలియా చేసింది. ఆమె అలక తీరితే సినిమా గురించి ఇంకా ఏదైనా పోస్ట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











