ఆలియా భట్ ఇక అంతా ఓపెనే.. సొంతంగా మీడియా పెట్టిన బ్యూటీ
అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న ఆలియాభట్ సొంత మీడియాను ఏర్పాటు చేసుకొన్నారు. ఇప్పటికే ఇన్స్‌టాగ్రామ్, ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్న ఆలియా ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. తాను సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించినట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. సరికొత్తగా, కొంత వినోదంతో యూట్యూబ్ తీసుకొస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. సుమారు మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియోను అలియా షేర్ చేశారు. తన వ్యకిగత జీవితానికి సంబంధించిన విషయాలను వీడియోలో ప్రస్తావించారు.
ఇప్పటి వరకు ఇన్స్‌టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో అందుబాటులోకి వచ్చాను. ఇక నుంచి యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాను. మీరు యూట్యూబ్‌లో నన్నుకలుసుకోవచ్చు. నా జీవితంలో ఏం జరుగుతున్నది. నా లైఫ్‌లో మంచి, చెడు, ఆనందకరమైన క్షణాలను, బిజీ షెడ్యూల్స్‌ను, మధురమైన రోజులను మీతో పంచుకొంటాను అని యూట్యూబ్ వీడియోలో అలియా వెల్లడించారు.

తాజాగా బ్రహ్మస్త సెట్స్‌లో చోటుచేసుకొన్న విషయాలను అలియా షేర్ చేసుకొన్నారు. ఆ వీడియోలో అక్షయ్ కుమార్ నటించిన మొహ్రా సినిమాలోని టిప్ టిప్ బర్సా పానీ చిత్రంలోని పాటకు స్టెప్పులు వేస్తూ కనిపించారు.
కాగా, తెలుగులో RRR చిత్రంలో అలియా భట్ నటిస్తున్నారు. వాస్తవానికి ఆమె తాజా షెడ్యూల్‌కు హాజరుకావాల్సింది. కానీ ప్రియుడు రణ్‌బీర్ సింగ్‌తో కలిసి యూఎస్‌కు చెక్కేసి షాక్ ఇచ్చారు. త్వరలోనే అలియా RRR సినిమా షూటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications