తెలుగు నేర్చుకున్నటున్న ముంబై ముద్దుగుమ్మ
ఎట్టకేలకు "RRR"తిరిగి సెట్స్ పైకి వెళ్లింది. దాదాపు ఏడు నెలల తర్వాత జక్కన టీమ్ తిరిగి షూటింగ్ ప్రారంభించడంతో చిత్రనిర్మాత దానయ్య ఆ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ కి రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ తదితర ప్రధాన తారాగణం తిరిగి సెట్లలోకి అడుగు పెట్టేసారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరడు రాజమౌళి తెరకెక్కిస్తున్నఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మన్యం వీరుడు అల్లూరిగా చరణ్ , గిరిజన వీరుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
ఇక సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా షూటింగ్ డిలే అవ్వడం..ఆతర్వాత సుశాంత్ మరణం తర్వాత అలియా భట్ పైన విమర్శలు రావడంతో ఈ సినిమాను నుంచి అలియా తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఈ పుకార్లకు జక్కన్న టీమ్ నిన్న విడుదల చేసిన వీడియోతో చెక్ పెట్టేసింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు నేర్చుకునే పనిలో ఉందట. స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పాలని భావిస్తున్న అలియా ఇందుకోసం తెలుగు నేర్చుకుంటుందట.

అల్లూరి సీతారామరాజు తో కీలక సన్నివేశాల్లో నటించాల్సి ఉండటంతో ఈ బ్యూటీ నవంబర్ మొదటివారంలో షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది. అలియా ప్రస్తుతం ముంబైలో సంజయ్ లీలా భన్సాలీ గంగూబాయి కతియావాడి షూటింగ్ లో బిజీగా ఉంది. అక్కడ రోజువారీ చిత్రీకరణలో పాల్గొంటూనే.. అలియా తన మొదటి తెలుగు చిత్రం కోసం కోచ్ ని నియమించుకుని మరీ భాష నేర్చుకుంటున్నట్లు సమాచారం.గంగూబాయి కతియావాడి ముంబై షూటింగ్ పూర్తయ్యాక.. RRR కోసం పూర్తిగా బరిలో దిగుతుందట. తెలుగు సినిమాల్లోకి ప్రవేశించడాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని భాషను నేర్చుకుంటోంది.


Click it and Unblock the Notifications











