మెగా హీరోతో అలియాభట్.. RRR హీరోయిన్‌కు మరోసారి రొమాన్స్!

దేశ సినీరంగంలో అద్బుతమైన అభినయం, అందంతో ఆకట్టుకొన్న యువ తారల్లో అలియాభట్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆమె నటించిన హైవే, టూ స్టేట్స్, కపూర్ అండ్ సన్స్, ఉడ్తా పంజాబ్, డియర్ జిందగీ, రాజీ, గల్లీ భాయ్ లాంటి చిత్రాలు ఆమెను స్టార్ హీరోయిన్‌గా మార్చాయి. ప్రస్తుతం గంగుభాయ్ కతియావాడీగా, RRR, బ్రహ్మస్త్ర లాంటి భారీ బడ్జెట్, విభిన్నమైన చిత్రాల్లో నటిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న RRR చిత్రంలో సీత పాత్రతో దక్షిణాది ప్రేక్షకులకు చేరువకానున్నారు. రాంచరణ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట మరోసారి జతకట్టేందుకు రంగం సిద్ధమైంది. రాంచరణ్, అలియాభట్ కలిసి నటిస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

Alia Bhatt to Romance with Ram Charan for Shankar Movie

ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, మెగా రాంచరణ్ రూపొందుతున్న చిత్రంలో అలియాభట్‌ను హీరోయిన్‌గా ఎంపి చేసినట్టు తెలుస్తున్నది. అధికారికంగా ఈ వార్త బయటకు రాకపోవడం గమనార్హం. త్వరలోనే ఈ సినిమా వివరాలను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.

రాంచరణ్, శంకర్ ప్రాజెక్టుకు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా 3డీలో రూపొందుతున్నట్టు తెలిసింది. దాదాపు ఐదు భాషలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X