ఆలియాను ట్రోల్స్‌తో ఆటాడుకొన్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?

చాలా కాలం డేటింగ్ తర్వాత, ఆలియా భట్ -రణబీర్ కపూర్ చివరకు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ పెళ్లి తర్వాత పట్టుమని పది రోజులు కూడా ఇద్దరూ ఇంటి పట్టున లేరు. ఎవరి సినిమా పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. పెళ్లైన రెండు రోజులకు ర‌ణ్‌బీర్‌ ఓ సినిమా ఆఫీసు దగ్గర కనిపించగా ఇప్పుడు ఆలియా భట్ కూడా బయట కనిపించింది. అయితే ఇప్పుడు ఆమె ట్రోలింగ్ బారిన పడింది. ఆ వివరాల్లోకి వెళితే

బేబీ పింక్ సూట్‌ ధరించి

బేబీ పింక్ సూట్‌ ధరించి

వివాహం అయిన 5 రోజుల తర్వాత, కపూర్ కుటుంబానికి చెందిన కోడలు మొదట బహిరంగ ప్రదేశంలో కనిపించింది. ముంబై విమానాశ్రయంలో ఆలియా కనిపించింది. ఈ సమయంలో, ఆమె చాలా సింపుల్ అవుట్ ఫిట్ లో కనిపించింది. ఆమె బేబీ పింక్ సూట్‌ను ధరించింది. బొట్టు, వదులైన జుట్టు అలాగే చెవి పోగులతో ఆలియా కనిపిస్తుంది. అంతేకాక ఎక్కువ ఓవర్ మేకప్ అవకుండా చాలా కూల్ గా కనిపిస్తోంది.

 కెమెరాలో బంధించడానికి

కెమెరాలో బంధించడానికి

కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'రాఖీ ఆర్ రాణీ కి ప్రేమ్ కహాని'లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పనుల నిమిత్తం ఆమె బయటకు వచ్చారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారి ఆలియా భట్ బయటకు రావడంతో ఫోటోగ్రాఫర్లు ఆమెను కెమెరాలో బంధించడానికి పోటీ పడ్డారు.

మంగళ సూత్రం ధరించలేదు

మంగళ సూత్రం ధరించలేదు

అయితే ఆమె ఫోటోలు వెంటనే వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే కొందరు ఆలియా మీద విమర్శలు గుప్పించారు. ఆలియా భట్ సంప్రదాయాలను పాటించడం లేదని కొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే సాధారణంగా హిందూ సంప్రదాయానికి చెందిన స్త్రీలు వివాహం తర్వాత పాపిట సింధూరం, నుదుటున కుంకుమ ధరించి మెడలో మంగళ సూత్రం ధరిస్తారు. కానీ ఆమె మాత్రం ధరించలేదు.

ట్రోలింగ్

ట్రోలింగ్

దీంతో పెళ్లి తర్వాత నుదుట సింధూరం ఎక్కడ? మెడలో మంగళ సూత్రం ఏది? అంటూ సోషల్ మీడియాలో ఆలియా భట్ మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. నిజానికి ఒకరికరంగా చెప్పాలంటే ఆలియాకు ట్రోల్స్ అసలు ఏమాత్రం కొత్త కాదు. గతంలో సుశాంత్ మరణం సమయంలో నేపో కిడ్ అని, సుశాంత్ మరణం వెనుక తన తండ్రి హస్తం ఉండడంతో ఆమె అసలు ఏమాత్రం స్పందించలేదని, ఆమెకు బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేదని ఇలా అనేక విధాలుగా ఆమెను ట్రోల్ చేశారు. ఇప్పుడు సంప్రదాయాలను పాటించడం లేదని ట్రోల్ చేస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఇక ఆలియా భట్ సినిమాల విషయానికి వస్తే ఆమె ఈ ఏడాది గంగూబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలు ఇచ్చిన జోష్ తో ఆమె మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధమవుతోంది. ఆమె తన భర్త రణబీర్ కపూర్ తో చేసిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఆమె ఈ ట్రోలింగ్ కు ఎలా సమాధానాం చెప్పాలో వేచి చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X