కొత్త బిజినెస్‌లోకి ఆలియాభట్.. రూట్ మార్చిన RRR బ్యూటీ!
బాలీవుడ్‌లో వరుస విజయాలు, సక్సెస్‌లతో దూసుకెళ్తున్న యువ హీరోయిన్ ఆలియాభట్ మరో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. సరికొత్త పాత్ర అంటే వెండి తెర మీద కాదు. వెండి తెర వెనుక నిర్మాతగా కీలక పాత్రను పోషించబోతున్నారు. తాను సినీ నిర్మాణం రంగంలోకి అడుగుపెడుతున్నట్టు ఈ బ్యూటీ ప్రకటించారు. ఆలియాభట్ ప్రారంభించబోయే బ్యానర ఇతర వివరాల్లోకి వెళితే..

భారీ ప్రాజెక్టులతో ఆలియాభట్
ఆలియాభట్ హీరోయిన్‌గా భారీ ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలోను, అలాగే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న గంగూభాయ్ కతియావాడి చిత్రంలో నటిస్తున్నారు.

గంగూభాయ్ కతియావాడి ఫస్ట్‌లుక్ వైరల్
తాజాగా రిలీజైన గంగూభాయ్ కతియావాడి చిత్రానికి సంబంధించిన టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. సినీ విమర్శకులు, ప్రముఖులతోపాటు సాధారణ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా నటిగా దూసుకెళ్తున్న సమయంలో నిర్మాతగా మారాలని నిర్ణయించుకొన్నారు.

నిర్మాత సొంత బ్యానర్
ఆలియాభట్ రూపొందించబోయే బ్యానర్ పేరు ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్. ఈ బ్యానర్‌కి సంబంధించిన లోగోను ఇటీవల ఆవిష్కరించారు. రెండు పిల్లి బొమ్మలతో ఫన్‌గా లోగోను తయారు చేశారు. ప్రస్తుతం ఆ లోగో అందర్నీ ఆకర్షిస్తున్నది.

ఆనందంగా ఉందంటూ..
అలియాభట్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ను ప్రారంభిస్తున్నానని తెలియజేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇక నుంచి మా బ్యానర్‌లో మంచి కథలు చెప్పాలని ప్రయత్నిస్తున్నాను అని తెలిపారు. సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్న ఆలియాకు కరణ్ జోహర్ విషెస్ అందజేశారు.


Click it and Unblock the Notifications











