ఆల్రెడీ అయిపోయింది... పెళ్లి వార్తలపై తమన్నా హాట్ కామెంట్!
Recommended Video
హీరోయిన్ తమన్నా పెళ్లి చేసుకోబోతోందని, గత 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నటిగా తన హవా కొనసాగిస్తున్న ఈ ముంబై బ్యూటీ లైఫ్‌లో సెటిలవ్వాలనే ఆలోచనలో ఉందంటూ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అమ్మా నాన్న చూసిన అబ్బాయితో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధమైందనే గాసిప్స్ గుప్పుమన్నాయి.
ఈ వార్తలపై తమన్నా వెంటనే స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని ఖండించారు. నా పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదు, మా తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారనే విషయంలో వాస్తవం లేదని తెలిపారు. అదే సమయంలో తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని స్పష్టం చేశారు.

ఆల్రెడీ అయిపోయింది
నేను చేస్తున్న పనితో నాకు ఎప్పుడో పెళ్లి అయిపోయింది. ప్రస్తుతం నా వర్క్‌తో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అందుకే మ్యారేజ్ ఆలోచన రావడం లేదు. మరొకరిని ప్రేమించే టైమ్ కూడా లేదని ఈ సందర్భంగా తమన్నా స్పష్టం చేశారు.

సినిమాలతో తమన్నా బిజీ బిజీ
ప్రస్తుతం తమన్నా చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘ఎఫ్ 2-ఫన్ అండ్ ఫ్రస్టేషన్' సినిమాతో విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఉదయనిధి స్టానిత్‌తో ఓ సినిమా చేయడంతో పాటు ప్రభుదేవాతో ‘అభినేత్రి 2' మూవీ చేసింది.

సైరా నరసింహారెడ్డి
తమన్నా తన కెరీర్లో బాహుబలి తర్వాత చేసిన మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరిసింహారెడ్డి'. అక్టోబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఆమె పోషించిన లక్ష్మీ అనే పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని, చిరంజీవి పోషించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు సపోర్టివ్‌గా ఉంటుందని తెలుస్తోంది.

తమిళ చిత్రాల్లో...
‘సైరా' తర్వాత తమన్నా తమిళంలో రెండు చిత్రాకు కమిటైంది. అందులో ఒకటి సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కనుంది. దీంతో పాటు తెలుగు హిట్ మూవీ ‘ఆనందోబ్రహ్మ 'తమిళ రీమేక్‌లో నటిస్తోంది. ‘క్వీన్' చిత్రానికి తెలుగు రీమేక్‌గా రూపొందిన ‘దట్ ఈజ్ మహాలక్ష్మి' త్వరలో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











