శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. తోడుగా ఆ స్టార్ హీరోయిన్?

ఒక ఇండస్ట్రీ నుంచి మరో ఇండస్ట్రీలోకి వెళ్లి సత్తా చాటి అందులోని వేరే ఇండస్ట్రీకి వెళ్లి సెటిల్ అయిపోయిన హీరోలు హీరోయిన్స్ కూడా చాలా మందే కనిపిస్తూ ఉంటారు. అలా అవ్వడానికి ఒక ప్రాంతం అయినప్పటికీ మరో ఇండస్ట్రీలో సెటిల్ అయ్యిన శ్రీదేవి మొదటిగా గుర్తుకొస్తారు సౌత్ లో కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ బాలీవుడ్ లో ఆమె సెటిల్ అయ్యారు. ఇలా చాలా మందే సౌత్ లో కెరీర్ స్టార్ట్ చేసిన అక్కడి హీరోయిన్స్ ఉన్నారు ఇక్కడ హీరోయిన్స్ కూడా ఉన్నారు.

కాగా తెలుగు నుంచి వెళ్లిన హీరోయిన్స్ మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పవచ్చు. మరి ఈ లిస్ట్ లో అయితే మన తెలుగు నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళబోతున్న యంగ్ హీరోయిన్ గా శ్రీలీల నిలిచింది. ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్ శ్రీలీల. ఎనర్జీకి మరో పేరులా మారిన ఈ యంగ్ హీరోయిన్ ఒక టైం లో ఇండియా లోనే అత్యంత బిజీగా మారిన హీరోయిన్ గా నిలిచింది.

all set for sreeleela bollywood debut along with mrunal thakur

ఒకే సమయంలో ఎన్నో సినిమాలు బ్యాలన్స్ చేస్తూ మోస్ట్ బిజీ హీరోయిన్ గా లీలా నిలిచింది. అయితే ఇపుడు ఓ సాలిడ్ హిట్ కోసం చూస్తుంది. ఈ ఏడాదిలో వచ్చిన తన కెరీర్ పెద్ద చిత్రం "గుంటూరు కారం" కూడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు. ఇక నెక్స్ట్ సినిమాల పైనే అన్ని హోప్స్ పెట్టుకుంది. అయితే ఇప్పుడు తెలుగులోనే ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి మొత్తం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

కాగా బాలీవుడ్ లో అయితే శ్రీలీల వచ్చే ఏడాది 2025 లో అడుగు పెట్టబోతుందట. అక్కడి యువ హీరో వరుణ్ ధావన్ తో శ్రీలీల ఎంట్రీ ఇవ్వబోతుండగా ఈ సినిమాలో తనతో పాటుగా టాలీవుడ్ లో తన సినిమాలతో వచ్చిన కొంత కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ కూడా కనిపిస్తుందని వినిపిస్తుంది. కాగా ఇటీవల బాలీవుడ్ లోకి మృణాల్ తిరిగి వెళ్ళిపోతుంది అని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

all set for sreeleela bollywood debut along with mrunal thakur

మరి అలా వెళుతూ వెళుతూ ఇప్పుడు శ్రీలీలని కూడా తీసుకెళ్తుందని కొందరు అంటున్నారు. మరి శ్రీలీల సౌత్ లో తన టాలెంట్ తో అందరినీ షాక్ కి గురి చేసింది మరి బాలీవుడ్ లో సర్వైవ్ అవ్వడం మరింత కష్టం మరి అక్కడ ఎలాంటి సినిమాలు చేస్తుందో అని తన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఇపుడు శ్రీలీల తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ తో రాబిన్ హుడ్ అలాగే మాస్ మహారాజ రవితేజా తో ధమాకా సినిమా తర్వాత రెండో సినిమా చేస్తుంది. ఇది రవితేజ కెరీర్ లో 75వ సినిమా కావడం విశేషం. కాగా వీటి అన్నింటిపై కూడా మంచి అంచనాలు ప్రస్తుతం ఉన్నాయి.

More from Filmibeat

Read more about: sreeleela bollywood mrunal thakur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X