కీర్తి సురేష్ కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఆ స్టార్ హీరో కొడుకుతో..!
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి ఫేమ్ అండ్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో తెలుగు, తమిళంలో పలు ఆఫర్స్ తో దూసుకెళ్తున్న టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఒకామె. కాగా తాను సౌత్ లో తెలుగు మినహా మిగతా భాషల్లో మొదటిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమెకి పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం మన తెలుగు ఇండస్ట్రీనే అని చెప్పాలి. ఇలా తెలుగులో భారీ స్టార్డంని సొంతం చేసుకుంది.
అయితే ఇక్కడ నుంచి ఆమె తెలుగులో వరుస ఆఫర్స్ ని సొంతం చేసుకోడమే కాకుండా తమిళ్ లో కూడా ముందు కంటే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ అందరి టైం ఒకేలా ఉండదు కదా ఇలానే కీర్తి సురేష్ కి కూడా టైం మధ్యలో చాలా బ్యాడ్ గా మారిపోయింది. ఒకదాన్ని మించి ఒకటి భారీ ప్లాప్ లు లేదా డిజాస్టర్స్ తోనే కీర్తి మలుపు తిరిగింది.

కాగా ఇదంతా ఆమెకి కోవిడ్ నుంచి మొదలై ఇప్పటికీ కొనసాగుతుంది కానీ మధ్యలో చిన్న చిన్న సినిమాలు లేడీ ఓరియెంటెడ్ కూడా చేస్తూ వచ్చింది. ఈ సినిమాలు చేస్తున్నప్పుడే కీర్తి సురేష్ కి ఆమె పెళ్లి సంబంధించి ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. వీటిలో ఆమె తన చిన్ననాటి స్నేహితుణ్ని పెళ్ళాడుతుంది అన్నట్టుగా కూడ పలు రూమర్స్ వచ్చాయి. ఇటీవల కొన్ని రోజులు కితమే మళ్ళీ ఆమె పెళ్లి కోసం వచ్చిన రూమర్స్ పై స్పందించింది.
తాను పెళ్లి, ప్రేమ అంటూ వచ్చే రూమర్స్ ని పెద్దగా పట్టించుకోను అని నా కుటుంబం వరకు వచ్చినా కూడా లైట్ తీసుకుంటాను, నా నటన సినిమాల విషయంలో విమర్శలు వస్తే మాత్రం తీసుకుంటాను అని చెప్పి ఎలాంటి రిలేషన్ షిప్స్ లో లేనని తేల్చేసింది. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ తనని ఓ స్టార్ హేరియ కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడని చెప్పిన మాటలు వైరల్ గా మారాయి.
ప్రస్తుతం కీర్తి తన తమిళ్ చిత్రం "రఘు తాత" ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కాగా ఈమె ఈ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ నాచురల్ స్టార్ నాని కొడుకు జున్ను ఎంతో క్యూట్ గా నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాడు అని తెలిపింది. నా బర్త్ డే కి కూడా జున్ను విష్ చేసాడు. అని కొన్ని ఆడియో రికార్డింగ్స్ కూడా వినిపించింది.
తనతో ఎప్పుడు మాట్లాడిన కలిసినా నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అంటాడు అని కీర్తి చెప్పుకొచ్చింది. ఇలా కీర్తి సురేష్ కి ఒక బుల్లి బాయ్ ఫ్రెండ్ దొరికాడు అని చెప్పాలి. కాగా నానితో కీర్తి సురేష్ "నేను లోకల్", గత ఏడాది "దసరా" అనే సెన్సేషనల్ హిట్స్ చేసిన సంగతి తెల్సిందే. వీరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ కూడా ఉంది. మరి మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ ఎపుడు పడుతుందో అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











