Allu Arvind: అప్పుడు లావణ్య.. ఇప్పుడు మృణాల్.. అల్లు కంటపడిందిగా!

సీతారామం సినిమాతో కుర్రాళ్ల మనసు దోచేసిన భామ మృణాల్ ఠాకూర్. ఈ మరాఠీ భామ ఇప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నానితో హాయ్ నాన్న.. విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాల్లో చేస్తుంది. అయితే ఇటీవల ఈమెపై అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అప్పుడు లావణ్య త్రిపాఠిపై చేసిన అల్లు అరవింద్... ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పై చేశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటో ఈ స్టోరిలో తెలుసుకుందాం.

మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ముందుగా సీరియల్స్ చేస్తూ హిందీ బుల్లితెరపై తన ముద్ర వేసుకుంది. ఆ తరువాత 'సీతారామం' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయిన ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అయింది. టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉండడంతో ఇక్కడ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం నాని సరసన 'హాయ్ నాన్న', విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్' సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది.

Allu Aravind Comments on Mrunal Thakur Same Like Lavanya Tripathi Same Like Lavanya Tripathi Video Goes Viral

ఒకరకంగా ఆమెకు అవకాశాలు వస్తున్నాయని అయినా ఆమె టెంప్ట్ అవకుండా తనకు నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుంటుంది అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే, ఇటీవల ఈ భామ ఇటీవల సౌత్ బిగ్గెస్ట్ అవార్డుల ఫంక్షన్ SIIMA దుబాయ్ లో నిర్వహించిన అవార్డుల ఈవెంట్ లో పాల్గొంది. సీతారామం సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని సొంతం చేసుకున్న ఆమె ఆ అవార్డు అందుకునేందుకు ఈవెంట్ కి హాజరైంది.

ఇక ఈ అవార్డుని అదే వేదిక మీద టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ చేతులు మీదుగా అందుకుంది. అవార్డు అందించిన తరువాత అల్లు అరవింద్, మృణాల్ తో మాట్లాడుతూ "గతంలో ఒక వేదిక పై ఒక హీరోయిన్ తో తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొని టాలీవుడ్ కి కోడలుగా వచ్చేయమని అన్నాను ఆ మాటని ఆ నటి నిజం చేసింది. ఇప్పుడు నీతో కూడా అదే మాట అంటున్నా.. టాలీవుడ్ కోడలుగా హైదరాబాద్ వచ్చేయ్" అంటూ ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

దానికి మృణాల్ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉండి పోవడం హాట్ టాపిక్ అయింది. అయితే అల్లు అరవింద్ మాటల్ని మృణాల్ కూడా నిజం చేస్తుందా..? లేదా తన పని తాను చూసుకుని వెళ్ళిపోతుందా అనేది చూడాలి. ఇక మృణాల్ నటిస్తున్న హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

Allu Aravind Comments on Mrunal Thakur Same Like Lavanya Tripathi Same Like Lavanya Tripathi Video Goes Viral

హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుండగా ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అండ్ సాంగ్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా విషయానికి వస్తే.. సంక్రాంతి కానుకగా తీసుకు రాబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడమే కాదు ఐరనే వంచాలా ఏంటి అనే డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X