Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టెజ్ పై మాట్లాడుతుంటే హీరోయిన్ మైక్ లాగేసుకున్న అల్లు అరవింద్.. పెళ్లి చేసుకో అంటూ..
గ్లామరస్ హీరోయిన్స్ లలో ఇంకా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కానీ వారిలో లావణ్య త్రిపాఠి ఒకరు. ఈ బ్యూటీ ఇంకా అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకోవడం లేదు. ఆమె కంటే తరువాత వచ్చిన వారు ప్రస్తుతం బారి బడ్జెట్ సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు. ఇక నెక్స్ట్ చావు కబురు చల్లగా సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తోంది. అయితే ప్రమోషన్ లో అల్లు అరవింద్ ఆమెపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏకంగా పెళ్లిపై సలహా ఇవ్వడంతో అందుకు సంబంధించిన వీడియో సినిమాపై బజ్ క్రియేట్ చేస్తోంది.
Chavu Kaburu Challaga Pre Release Event Photos
సరైన హిట్ లేదు..
పోటీ ఎంత ఉన్నా కూడా లావణ్య త్రిపాఠి తనదైన శైలిలో మీడియం రేంజ్ సినిమాల్లో ఛాన్సులు అందుకుంటోంది. సినిమాల రిజల్ట్ తేడా కొట్టినా కూడా తన గ్లామర్ తో కుర్రాళ్లను ఎప్పటికప్పుడు ఎట్రాక్ట్ చేస్తోంది. నిజానికి సోగ్గాడే చిన్న నాయన తరువాత ఈ బ్యూటీ సరైన హిట్ లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఆమెకి కలిసి రాలేదు.
ఆశలన్నీ ఈ సినిమాపైనే
ఇటీవల వచ్చిన A1 ఎక్స్ ప్రెస్ కూడా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక తన ఆశలన్నిటిని చావు కబురు చల్లగా సినిమాపైనే పెట్టుకుంది. ఇందులో ఆమె ఒక రిస్కీ పాత్రలో నటించింది. భర్త చనిపోయిన మహిళ పాత్రలో నటించినట్లు ప్రచారంలోనే క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో హీరోగా కార్తికేయ నటించిన విషయం తెలిసిందే.
గ్రాండ్ వెల్కమ్
అయితే ఇటీవల ప్రమోషన్ కోసం వైజాగ్ కు వెళ్లగా అక్కడ లావణ్య త్రిపాఠికి గ్రాండ్ గా వెల్కమ్ దక్కింది. ఆమెను చూసిన కుర్రాళ్ళు ఒక్కసారిగా సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఇక అది చూసిన అందాల రాక్షసి ఎంతగానో సంతోషించింది. తన జీవితంలో ఇలాంటి రెస్పాన్స్ చూడలేదని మైండ్ బ్లోయింగ్ అని చెప్పింది.
మైక్ లాగేసుకున్న అల్లు అరవింద్
ఇక లావణ్య త్రిపాఠి మాట్లాడుతుంటే మైక్ లాగేసుకున్న నిర్మాత అల్లు అరవింద్ ఎవరు ఊహించని విదంగా కామెంట్ చేశారు. ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చాలా చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా.. అంటూ సలహా ఇచ్చారు. దీంతో లావణ్య పక్కున నవ్వేసింది. నాకు త్వరగా పెళ్లి చేసేయ్యండి నాన్న అంటూ అందాల రాక్షసి డైలాగ్ కొట్టేసింది. ఇక చావు కబురు చల్లగా సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.