స్విమ్మింగ్ పూల్‌లో అల్లు అర్జున్ బ్యూటీ.. బికినీలో అదిరిపోయే గ్లామర్ ట్రీట్ ..
Shraddha Das: హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యూత్ ను రెచ్చగొట్టేలా ఉన్నా.. బోలెడంత టాలెంట్ ఉన్నా.. ఈ అమ్మడుకు లక్ కలిసి రావడం లేదు. ఇండస్రీకి వచ్చి చాలా రోజులు అవుతున్నా.. సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమైంది. అంతేకాదు.. గత కొన్ని రోజులుగా ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. కానీ, ఎప్పటికప్పడు తన ఫోటో షూట్స్ తో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది ఈ అమ్మడు. రీసెంట్ గా ఈ అందాల భామ బికినీలో గ్లామర్ షో చేసింది. తన అంగాంగ ప్రదర్శనతో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.
హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన 'కంగువా' మూవీలో ఓ పాట పాడి అలరించింది. ఈ అమ్మడుకు ఆకట్టుకునే అందం, నటన ఉన్న.. కేవలం గ్లామర్ తరహా పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుంది. అల్లరి నరేష్ 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రద్ధా దాస్.. అల్లు అర్జున్ 'ఆర్య 2' సినిమాతో పాపులర్ అయింది.

ఈ అమ్మడు ఆర్య 2, డార్లింగ్, పీఎస్‌వీ గరుడవేగ, నాగవళ్లి సినిమాల్లో నటించి, మెప్పించింది. కానీ, ఆమె అనుకున్నంత తరహాలో ఆఫర్స్ అందుకోలేకపోయింది. ఈ అమ్మడు కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అందుకోలేకపోయింది. సుకుమార్ -అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఆర్యా 2 సినిమాతో శ్రద్దా దాస్ ఓవర్ నైట్ స్టార్ గా మారినా .. ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత పలు సక్సెస్‌పుల్ చిత్రాల్లో నటించినా శ్రద్ధాకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. సెకండ్ గ్రేడ్ హీరోయిన్ రోల్స్ తోనే పరిమితం కావాల్సివస్తోంది.
శ్రద్ధా దాస్ కేవలం తెలుగు మూవీలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీలో 'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది. అలాగే.. 'ఖాకీ బిహార్ ఛాప్టర్' వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అందాల ఆరబోత, ఇంటిమేట్ సీన్స్ చేయడంలో ఎలాంటి బెరుకులేకపోవడంతో ఇలాంటి అవకాశాలు వస్తున్నట్టు టాక్.

ఇలా సెకండ్ గ్రేడ్ కే పాత్రలకే పరిమితం కావడంతో.. తనదైన గ్లామర్ షోలతో సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా కనిపిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. తన ఫాలోవర్స్ ను తన హాట్ ఫోటో షూట్ తో రెచ్చగొడుతుంది. తన అందాల ఆరబోతతో ఫిదా చేస్తోంది. అలాగే.. సరైన అవకాశాలు లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్ తో కాలం వెళ్లదీస్తోంది. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం గోవా వెళ్లింది శ్రద్ధా దాస్. గత నాలుగైదు రోజులుగా అక్కడే ఎంజాయ్ చేస్తుంది. ఈ తరుణంలో ఓ సిమ్మింగ్ లో బికినీలో రెచ్చిపోయింది. తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు శ్రద్దా. ఏదేమైనా శ్రద్ధాకు మంచి హిట్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











