పరుగు హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఊహించని లుక్కులో అలాంటి వ్యక్తికి భార్యగా..
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న హీరోయిన్స్ కూడా కొంతకాలానికే కనిపించకుండా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం వలన సీనియర్ హీరోయిన్స్ గురించి చాలా ఈజీగానే తెలిసిపోతుంది. ఇక చాలాకాలం తర్వాత పరుగు హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఆ బ్యూటీ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు చాలా వరకు గ్యాప్ ఇచ్చేసింది. సీనియర్ హీరోయిన్స్ అందరూ కూడా వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్న సమయంలో అమ్మడు ఎలాంటి ఆఫర్స్ ను స్వీకరించడం లేదు. ఇక ప్రస్తుతం ఆ బ్యూటీ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

పరుగు సినిమా: నవదీప్ హీరోగా వచ్చిన సీతాకోక చిలుక సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన షీలా కౌర్ మీకు గుర్తుందా.. ఇలా అడిగే కంటే కూడా పరుగు సినిమా హీరోయిన్ అంటేనే మీకు బాగా తెలుస్తుందేమో. అయితే 2011లో చివరగా పరమ వీర చక్ర సినిమాలో కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ అప్పటి నుంచి తెరమరుగు అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడా ఎవరికీ కనిపించలేదు.
గుడ్ బై చెప్పినట్లు: అసలు ఆమె ఎక్కడ ఉంది, ఎలా ఉందనేది కూడా ఎవరికీ తెలియదు. అయితే సినిమా అవకాశాలు ఎక్కువగా రాకపోవడం వల్లే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు కొంతమంది చెబుతున్నారు. ఏదేమైనా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ క్యూటీ కరోనా సమయంలోనే పెళ్లి చేసుకుంది. సంతోష్ రెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా.. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ పాప కూడా ఉంది.

భర్తతో ఫొటోలు: అయితే ఈమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అందులో భర్త సంతోష్ రెడ్డితో కలిసి దిగిన కొన్ని ఫొటోల్లో షీలా చాలా కొత్తగా కనిపిస్తోంది. పట్టి పట్టి చూస్తే తప్పా అమెనేనా కాదా అనే అనుమానం వస్తోంది. అంతలా మారిపోయిందీ ముద్దుగుమ్మ. కాస్త బొద్దుగా భలేగా కనిపిస్తోంది. అయితే ఈ ఫొటోలు చూసిన ఈమె ఫ్యాన్స్ అంతా.. మళ్లీ సినిమాల్లోకి రమ్మంటూ కామెంట్లు చేస్తున్నారు.
మళ్ళీ నటిస్తుందా?: చాలా మంది హీరోయిన్లు పెళ్లి, పిల్లలు అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు కూడా అలాగే స్టార్ట్ చేయండి అంటూ చెప్పుకొస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా సరే చేస్తూ.. మమ్మల్ని అలరించండి అంటూ వివరిస్తున్నారు. మరి షీలాకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది మాత్రం తెలియదు. ఆమె నేరుగా స్పందిస్తే తప్ప మనకు ఏ వివరాలు తెలియవు.

హిట్ సినిమాలు: కేవలం తెలుగు చిత్రాల్లోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ నటించిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా రాజు భాయ్, హలో ప్రేమిస్తారా, పరుగు, మాయాబజార్, మస్కా, అదుర్స్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత అవకాశాలు రాక సీనియర్ హీరో బాలకృష్ణ సరసన కూడా నటించింది. ఆ తర్వాత కూడా పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో సినిమాలకు బైబై చెప్పేసింది.


Click it and Unblock the Notifications











