Poonam Bajwa: టాప్ వ్యూలో ఒకప్పటి హీరోయిన్ ఎద అందాలు.. వయసు 40 అంటే నమ్మగలరా?
ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ వయసుతో సంబంధం లేకుండా వారి గ్లామర్ తో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. వయసు ఏమాత్రం కనిపించకుండా గ్లామర్ తో చాలా మాయ చేస్తున్నారు అనే చెప్పాలి. ఇక ఒకప్పుడు క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న పూనమ్ బాజ్వా గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ బ్యూటీ ఒకప్పుడు అసలు గ్లామర్ తో పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్ది నేటితరం యువ హీరోయిన్స్ తరహాలో హీటెక్కిస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మొదటి సినిమాతో..
మొదట మోడల్ గా ముంబైలోనే చాలా బిజీ బిజీగా గడిపిన ఈ బ్యూటీ ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోవాలి అని ప్రయత్నం చేసింది. ఇక ఆమె 2005లో నవదీప్ నటించిన 'మొదటి సినిమా' అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత ప్రేమంటే ఇంతే అనే సినిమాతో కూడా మంచి గుర్తింపు అందుకుంది.

కొత్తలోనే నాగార్జున దృష్టిని ఆకర్షించి..
ఇక ఆ తర్వాత తప్పకుండా పూనమ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంటుంది అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే వచ్చిన కొత్తలోనే ఆమె నాగార్జున దృష్టిని ఆకర్షించింది. ఇక బాస్ సినిమాలో ఒక పాత్రకు ఆమెను తీసుకున్నారు. అయితే ఆ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక తర్వాత కన్నడ మలయాళం ఇండస్ట్రీలో కూడా ఈ బ్యూటీ సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.

అల్లు అర్జున్ సినిమాలో..
తెలుగులో అయితే హీరోయిన్ గా నిలదుక్కుకోవాలి అని పూనమ్ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఎందుకో అదృష్టం కలిసి రాలేదు. ఇక అల్లు అర్జున్ పరుగు సినిమాలో హీరోయిన్ అక్క పాత్రలో నటించింది. ఇక ఆ పాత్ర ఉన్నంత మేరకు బాగానే వర్కౌట్ అయింది. దీంతో తమిళంలో మళ్లీ వెంటనే ఒకేసారి ఐదు సినిమాలకు సంతకం చేసింది.

ఎన్టీఆర్ బయోపిక్ లో..
ఇక హీరోయిన్ గా కాకపోయినా సైడ్ హీరోయిన్ గా అయినా సరే ఈ డ్యూటీ ముఖ్యమైన పాత్రలలో కూడా నటిస్తోంది. ఇక గతంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీసినప్పుడు అందులో గరాపాటి లోకేశ్వరి పాత్రలో నటించింది. కానీ ఆ సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేదు. ఇక మళ్లీ ఆ తర్వాత పూనమ్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు.

ఎద అందాలతో ఘాటుగా..
సినిమా అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా ఈ బ్యూటీ మాత్రం తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది. ఇటీవల కాలంలో అయితే ఎద అందాలతో అమ్మడు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రీసెంట్ గా జీన్స్ అలాగే ఒక ఫ్యాషన్ టాప్ తో అలా సోఫాపై పడుకుని క్లివెజ్ అందాలను చాలా ఘాటుగా ప్రజెంట్ చేసింది. గతంలో చాలాసార్లు ఈ బ్యూటీ ఇంతకంటే ఘాటుగా కనిపించినప్పటికీ ఈ లుక్ లో మాత్రం చాలా అందంగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు.
ఈ వయసులో ఏంటీ రచ్చ..
ఇప్పటివరకు పూనమ్ సోషల్ మీడియాలో అలాగే ఎక్కడ ఇంటర్వ్యూలలో కూడా తన వయసు గురించి ప్రస్తావించలేదు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 18 ఏళ్లు పూర్తయింది. అంటే దాదాపు నాలుగు పదుల వయసు దాటి 50 ఏళ్ళ వయస్సు దగ్గరలోకి వస్తోంది. అయినప్పటికీ కూడా ఇంకా పాతికేళ్ళ హీరోయిన్ తరహా లోనే తన గ్లామర్ తో మాత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరి ఈ అందంతో అమ్మడు ఇంకా ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











