సైలెంట్‌‌గా ఆ సినిమాను పూర్తి చేసిన అక్కినేని అమల.. చాలా గ్యాప్ తర్వాత అలా!

ఒకప్పుడు వరస సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపించారు సీనియర్ హీరోయిన్ అమల. అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సహా ఎంతో మంది సినిమాల్లో నటించి మెప్పించారామె. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయారు. అక్కినేని నాగార్జునతో ప్రేమ వివాహం తర్వాత అమల సినీ కెరీర్‌కు బ్రేక్ పడింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' సినిమాలో హీరోకు తల్లిగా నటించి రీఎంట్రీ ఇచ్చారు అమల. దీని తర్వాత మరో సినిమాలో పూర్తి స్థాయిలో నటించలేదు.

సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అక్కినేని అమల మరో సినిమాను కంప్లీట్ చేశారు. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తోన్న సినిమాలోనే ఆమె నటించారు. ఇందులో హీరోకు తల్లి పాత్రను పోషించిన ఆమె.. అద్భుతమైన నటనతో ఆకట్టుకోవడం గ్యారెంటీ అని చిత్ర యూనిట్ చెబుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌పై 'ఖైదీ' ఫేం ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందించాడు. ఇందులో రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. అలాగే వెన్నెల కిశోర్, ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్ చేశారు.

Amala Akkineni Completed Sharwanand Movie

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి కారణం.. శర్వానంద్ నటించని మరో సినిమా 'శ్రీకారం' విడుదల వాయిదా పడడమేనట. కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమానే ముందు రిలీజ్ చేయాలని శర్వానంద్ భావిస్తున్నాడట. అందుకే అమల నటించిన ఆ సినిమా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ప్రకటించకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X