నాగ చైతన్య అలాంటి వాడు.. అప్పుడే అతడి గురించి తెలిసింది.. అమల కామెంట్స్ వైరల్

Amala Akkineni: టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబంపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా హీరో నాగ చైతన్యకు తన స్టెప్ మదర్ అమలతో ఉన్న అనుబంధం ఎలా ఉందనే ప్రశ్న అభిమానుల్లో, సినీ వర్గాల్లో చాలాసార్లు వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇద్దరూ పబ్లిక్ ఈవెంట్లలో కలిసి కనిపించిన సందర్భాలు చాలా అరుదుగా ఉండటంతో అపోహలు పెరిగాయి. కానీ తాజాగా అమల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ అనుమానాలకు పూర్తి స్టాప్ పెట్టాయి. నాగచైతన్య వ్యక్తిత్వం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

అమల మాట్లాడుతూ తనకు నాగ చైతన్యపై ఉన్న గౌరవం, అభిమానాన్ని ఎంతో కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారని స్పష్టం చేసింది. నాగార్జున-లక్ష్మి పెళ్లి తర్వాత నాగ చైతన్య పుట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడిపోయారు. లక్ష్మి చెన్నై వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది. నాగార్జున తర్వాత తనతో కలిసి నటించిన అమలతో ప్రేమలో పడి, 1992లో తన రెండో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అఖిల్ జన్మించాడు. ఇక నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ అక్కినేని కుటుంబ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Amala Akkineni Opens Up About Naga Chaitanya

ఈ నేపధ్యంలో చైతన్యకు అమలతో ఎలాంటి సంబంధం ఉందనే ప్రశ్నలే ఎక్కువగా వినిపించేవి. ఇటీవల హీరోయిన్ అమల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. సమయంలో పిల్లల విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని యాంకర్ ప్రశ్నించగా.. అమల ముందుగా నాగ చైతన్య గురించి చెబుతూ.. "చైతన్య రియల్లీ చాలా హానెస్ట్.. యంగ్ అండ్ డైనమిక్, తన మదర్ చెన్నై లో ఉన్నారు. కాలేజ్ టైంకు హైదరాబాద్ కు వచ్చారు. అంతకు ముందుకు కూడా నాకు తెలుసు. అప్పుడప్పుడు టచ్ లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చాడో అప్పటినుండి చైతన్య వ్యక్తిత్వం మరింత దగ్గరగా అర్థమైందని' అమల వెల్లడించింది.

చైతూ లవ్లీ హ్యూమన్ బీయింగ్. అతడు చాలా మెచ్యూర్, చాలా టాలెంటెడ్ గల వాడని అమల పేర్కొన్నారు. ఏ విషయంలోనైనా చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటాడనీ, నిర్ణయాలు తీసుకునే ముందు వాటి ఫలితాలను ముందే అంచనా వేసే సామర్థ్యం ఉంటుందని వివరించారు. ముఖ్యంగా తన తండ్రి నాగార్జునను ఎంతో గౌరవిస్తాడని, ఆయన చెప్పే మాటను ఎప్పుడూ దాటి ప్రవర్తించలేదని ఆమె ఒక తల్లిలా చెప్పింది. చిన్నప్పటి నుంచే చైతన్య తనకు ప్రత్యేక గుర్తింపు ఉండాలని తపించాడని, అందుకే అక్కినేని కుటుంబ వారసుడిగానే కాకుండా తనకంటూ కథా ఎంపికలు చేసుకుంటూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నాడని చెప్పారు. అలాగే.. ఒక డిఫరెంట్ జోన్.. ప్లానింగ్ లో ఉంటాడు అంటూ నాగచైతన్య పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇక అఖిల్ గురించి మాట్లాడుతూ అమల భావోద్వేగంతో స్పందించింది. "అఖిల్ నా కుమారుడు. నా ప్రభావం వాడిపై ఎక్కువ" అని చెప్పినా, నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం ఇద్దరు సోదరులు కూడా స్వతంత్రంగానే ముందుకు సాగతారని తెలిపారు. కెరీర్‌లో ఏమి చేయాలి? ఎప్పుడు చేయాలి? ఏ నిర్ణయం తీసుకుంటే దాని లాభనష్టాలు ఏంటి? ఇవన్నీ ముందుగానే ఆలోచించే అలవాటు ఇద్దరికీ ఉందని చెప్పారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే తమ కాళ్లపై నిలబడే అవకాశమిచ్చామని, వారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఎదురయ్యే పరిణామాలను కూడా ఎదుర్కొనే ధైర్యం వాళ్లకు ఉందని అమల స్పష్టంగా చెప్పింది.

అలాగే.. వాళ్లకు ఫెల్యూర్ వచ్చినా, సక్సెస్ వచ్చినా కుటుంబం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందన్న ధైర్యం నాగ చైతన్య, అఖిల్ ఇద్దరికీ ఉంది. కుటుంబంలో ఉన్న బాండింగ్ కనబడకపోయినా, లోపల మాత్రం పరస్పర గౌరవం, ప్రేమ ఉన్నాయని తెలిపారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా అమల, చైతన్య, అఖిల్ మధ్య ఉన్న అనుబంధంపై క్లారిటీ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X