నాగ చైతన్య, అఖిల్ మధ్య తేడా అదే.. అక్కినేని అమల షాకింగ్ కామెంట్స్ ..
Amala Akkineni: టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబం ఎప్పుడూ చర్చల్లో ఉంటుంది. ముఖ్యంగా నటి అమల అక్కినేని, నాగార్జున, అలాగే పిల్లలు నాగ చైతన్య-అఖిల్ మధ్య ఉన్న బంధం గురించి అభిమానుల ఆసక్తి ఎప్పుడూ తగ్గదు. తాజాగా అమల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, చైతన్య-అఖిల్ వ్యక్తిత్వాల మధ్య ఉన్న తేడా, తన కోడళ్లపై తన ప్రేమపై అమల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఏమన్నారంటే?
అమల మాట్లాడుతూ, నాగ చైతన్య స్వభావం గురించి ఆశ్చర్యపరిచే విధంగా వివరించింది. "చైతన్య చిన్నప్పటి నుంచే చాలా కామ్, డిసిప్లిన్‌డ్ వ్యక్తి. చెన్నైలో పుట్టి పెరిగి, కాలేజ్ టైంలో హైదరాబాద్‌కి వచ్చాడు. ఆ సమయంలో అతనికి జీవితం మీద క్లారిటీ మరింత పెరిగింది. ఏది కరెక్ట్ ? ఏది రాంగ్? అని తనకు బాగా తెలుసు. అలాగే.. తండ్రి నాగార్జున చెప్పిన మాటకు చైతన్య ఎంతో విలువ ఇస్తాడు. ఏ సూచన ఇచ్చినా.. అది తూచా తప్పుగా పరిగణలోకి తీసుకుంటాడు, తర్వాతే నిర్ణయం తీసుకుంటాడు" అని అమల తెలిపింది.

అమల ఇంకా మాట్లాడుతూ, చెన్నైలో ఉన్నప్పడే టచ్‌లో ఉండేవారని, అతని వ్యక్తిత్వం తనకు అప్పటినుంచే అర్థమైనట్లు తెలిపింది. ఇక అఖిల్ గురించి మాట్లాడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అఖిల్ తన జీవితాన్ని చూసే కోణం భిన్నమని స్పష్టంగా తెలిపింది. నిర్ణయాల విషయానికి వస్తే చైతన్య-అఖిల్ ఇద్దరూ స్వతంత్రంగా ముందుకు సాగుతారు. కెరీర్ ఎంపిక, కొత్త అవకాశాలు... ఏ నిర్ణయం అయినా తీసుకునే ముందు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగే పరిణామాలపై లోతుగా ఆలోచించే అలవాటు వారిద్దరికీ చిన్నప్పటి నుంచే ఉందని తెలిపారు.
అయితే.. "అఖిల్ మాత్రం నేను చెప్పిన ప్రతిదానికీ వాదిస్తాడు. ఒక నిర్ణయం తీసుకుంటాడు.. తర్వాత తిరిగి మార్చేస్తాడు. గోడమీద పిల్లిలా మరో గోడకు దూకినట్లు" అఖిల్ తన నిర్ణయాల్లో కంగారు పడతాడని, అనుభవాల ద్వారా స్థిరంగా నిలబడే స్థాయిలో ఉన్నాడని ఆమె చెప్పింది. వయస్సు, అనుభవం, మానసిక పరిణతి ఇవి ఇద్దరిలో వేర్వేరు దశల్లో ఉన్నాయని స్పష్టం చేసింది. తన పిల్లలను పెంచే సమయంలో తాను, నాగార్జున ఇద్దరూ వాళ్లే తమ కాలిపై నిలబడేలా అవకాశం ఇచ్చామని అమల తెలిపారు.
విజయాలకు మాత్రమే కాదు, అపజయాలకు కూడా ఎదురెదురుగా నిలబడే ధైర్యం వారికి ఉండాలని నేర్పారని చెప్పారు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ఫలితాలు ఎలా ఉండబోతాయో ముందే అంచనా వేసి, దాని బాధ్యతను స్వయంగా మోయగల లైఫ్ స్కిల్స్‌ను ఆమె ఇద్దరికీ నేర్పించారని పేర్కొన్నారు. వారి జీవితాల్లో సక్సెస్ రావచ్చు... ఫెయిల్యూర్ కూడా రావచ్చు.. కానీ, ఏ పరిస్థితిలోనైనా కుటుంబం వారి వెన్నంటే ఉంటుందన్న నమ్మకం ఉందని అమల చెప్పారు. బయట ప్రపంచానికి వారి బాండింగ్ అంత స్పష్టంగా కనిపించకపోయినా, ఇంట్లో మాత్రం పరస్పర గౌరవం, ప్రేమ ఎప్పుడూ ఉంటుందని అమల తేల్చి చెప్పింది.
అక్కినేని కుటుంబంలోకి వచ్చిన ఇద్దరు కోడళ్ల గురించి అమల హృదయపూర్వకంగా స్పందించింది. "నాకు ఇద్దరు మంచి కోడళ్లు దొరికారు. వారితో టైం గడపడం చాలా ఇష్టం.'శోభిత డేరింగ్,మెచ్యూర్'అని, జైన్(అఖిల్ భార్య) "క్యూట్ గర్ల్, ఇంట్లో ఉంటే సందడి పెరుగుతుంది" అని చెప్పింది. ఇవి కేవలం ప్రశంసలు కాదు.. అక్కినేని కుటుంబంలో సంబంధాలు బలంగా ఉన్నాయనే సంకేతం. ఈ ఇంటర్య్వూలో ఒక దశలో అమల భావోద్వేగానికి లోనయ్యారు.


Click it and Unblock the Notifications











