సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్.. కరోనాను లెక్కచేయకుండా ముద్దులు.. వైరల్ పిక్స్
తెలుగు, తమిళ చిత్రాల్లో ఫేమస్ అయిన నటి అమలాపాట్. కేవలం చిత్రాలతోనే కాదు వ్యక్తిగత జీవితంలోని ఘటనలతోనూ బాగానే ఫేమస్ అయింది. దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్న అమలాపాల్.. కొన్ని రోజులకే ఆ బంధానికి ముగింపు పలికింది. కొన్ని రోజులుగా ఒంటరిగా ఉంటూ వచ్చిన.. ఈ హీరోయిన్ తాజాగా గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకుంది. ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.
Recommended Video

ప్రేమ, పెళ్లి, విడాకులు..
అమలాపాల్ జీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు చకచకా జరిగిపోయాయి. దర్శకుడు విజయ్‌తో పీకల్లోతూ ప్రేమలో మునిగి పెళ్లి చేసుకుంది. కుటుంబంలో వచ్చిన మనస్పర్ధల వల్ల విడియామని, తమ మధ్య ఎలాంటి గొడవలు రాలేదని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ విజయ్ తనకు మంచి మిత్రుడేనని పేర్కొంది.

విజయ్ తండ్రి ఆరోపణలు..
ఆ మధ్య విజయ్ తండ్రి చేసిన ఆరోపణలతో మళ్లీ వార్తల్లో నిలిచింది అమలాపాల్. విజయ్ అమలాపాల్ విడిపోవడానికి కారణం.. ధనుష్ అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. సినిమాల్లో నటించొద్దని అన్నా వినిపించుకోలేదని, ధనుష్ కోరడంతో మళ్లీ సినిమాల్లో నటించిందని అందుకే వారిద్దరు విడిపోయారని తెలిపాడు .అయితే అలాంటిదేమీ లేదని అమలాపాల్ కొట్టిపారేసింది.

హింట్ ఇచ్చిన హీరోయిన్..
మళ్లీ ప్రేమలో ఉన్నారా? రెండో పెళ్లి చేసుకుంటారా? అని అడిగినా ప్రతిసారి దాట వేస్తూ వచ్చింది అమలాపాల్. అయితే ఆమె షేర్ చేసే ఫోటోలే ఆమె ప్రేమలో ఉన్నాయన్న హింట్ ఇచ్చింది. ఇద్దరూ కలిసి బయట తిరగడం, వాటికి సంబంధించిన పిక్స్ వైరల్ కావడంతో అమలాపాల్ రిలేషన్‌లో ఉందని అందరూ ఫిక్స్ అయ్యారు.

సీక్రెట్‌గా పెళ్లి..
బాలీవుడ్ సింగర్ భవిందర్ సింగ్‌తో గత కొంతకాలంగా రిలేషన్ షిప్‌లో ఉంది అమలాపాల్. తాజాగా ఆమె వివాహానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక వీరిద్దరిని చూస్తే కరోనాను లెక్కచేయనట్టే కనిపిస్తోంది. రెచ్చి పోయి మరీ ముద్దులు పెట్టేసుకున్నారు.


Click it and Unblock the Notifications











