బీచ్‌లో తడిచిన బట్టల్లో అమలా పాల్ రచ్చ: అదొక్కటే అడ్డంగా పెట్టుకుని మరీ ఘాటుగా!

అమలా పాల్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ అమ్మడు టాలీవుడ్‌లో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన చేయగల సత్తా ఉన్నా.. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలా పరాజయాలను చవి చూసింది. దీంతో తెలుగులో పెద్దగా సక్సెస్‌లను అందుకోలేదు. కానీ, వేరే భాషల్లో మాత్రం చాలా హిట్లను ఖాతాలో వేసుకుంది. ఇక, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తోన్న అమలా పాల్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బీచ్‌లో తడిచిన అందాలతో కనువిందు చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి!

అలా మొదలైన అమల కెరీర్

అలా మొదలైన అమల కెరీర్

చిన్న వయసులోనే అమలా పాల్ ‘నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ‘బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. కానీ ఇది నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత అమలా పాల్ నటించిన ‘బెజవాడ', ‘నాయక్', ‘ఇద్దరమ్మాయిలతో' ‘జెండాపై కపిరాజు' సక్సెస్ కాలేదు.

డైరెక్టర్‌తో పెళ్లి... విడాకులతో

డైరెక్టర్‌తో పెళ్లి... విడాకులతో


వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న అమలా పాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో లవ్ ట్రాక్ నడిపింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించిన ఈ ఇద్దరూ.. అది బహిర్గతం కావడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం అయిన సంగతి తెలిసిందే.

నగ్నంగా నటించి షాకిచ్చేసి

నగ్నంగా నటించి షాకిచ్చేసి

వివాహం తర్వాత అమలా పాల్ పెద్దగా సినిమాల్లో నటించలేదు. కానీ, విడాకుల తీసుకున్న తర్వాత ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆ మధ్య ‘ఆమె/అడై' అనే సినిమాను చేసింది. ఇందులో ఆమె ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో అమలా పాల్ చేసిన ఈ భారీ సాహసం అప్పట్లో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిపోయింది.

రెండో పెళ్లి వార్తలతో హైలైట్

రెండో పెళ్లి వార్తలతో హైలైట్

విజయ్‌ను పెళ్లి చేసుకుని విడిపోయిన తర్వాత అమలా పాల్ ఏం చేసినా హైలైట్ అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె యువ సింగర్ భరిందర్ సింగ్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్త అప్పట్లో వైరల్ అయింది. అంతేకాదు, కొన్ని ఫొటోలు బయటకు రావడంతో వాళ్లిద్దరూ వివాహం చేసకున్నారని ప్రచారం కూడా మొదలైంది. దీంతో అమల ఆ వార్తలను కొట్టిపారేసింది.

మళ్లీ బిజీ అయిన హీరోయిన్

మళ్లీ బిజీ అయిన హీరోయిన్

టాలీవుడ్‌లో అంతగా సక్సెస్ కాలేకపోయిన అమలా పాల్.. గత ఏడాది ఆహా కోసం అమలా పాల్ ‘కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ‘యూటర్న్' ఫేం పవన్ కుమార్ దీనికి దర్శకుడు. టైమ్ లాప్స్ అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సిరీస్‌ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పలు చిత్రాలను చేయబోతుంది.

అందులో అందాల ఆరబోత

అందులో అందాల ఆరబోత


వరుస ఆఫర్లతో ఎంత బిజీగా ఉన్నా.. అమలా పాల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఎప్పుడూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. దీంతో ఆమె ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది.

Recommended Video

Amala Paul Reacts On Her Latest Viral Photos | Filmibeat Telugu
బీచ్‌లో తడిచిన బట్టల్లో రచ్చ

బీచ్‌లో తడిచిన బట్టల్లో రచ్చ


చాలా కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న అమలా పాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బీచ్‌లో తడిచిన బట్టల్లో కనిపించింది. ఫలితంగా ఈ హీరోయిన్ అందాలు మొత్తం నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X