సింగర్‌తో అమలాపాల్ సహజీవనం.. రొమాంటిక్ ఫోటోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్

తమిళ, తెలుగు రంగాల్లో తనదైన శైలిలో రాణిస్తున్న బ్యూటీ అమలాపాల్ గురించి మీడియాలో వివాదాస్పద కథనాలు, రూమర్లు, గాసిప్స్ ఎక్కువగానే వినిపిస్తాయి. తాజాగా అమలాపాల్ మళ్లీ ప్రేమలో పడ్డారు అనే వార్త వినిపిస్తున్నది. అయితే ఆమె మాత్రం అలాంటి వార్తలపై స్పందించకుండా మౌనంగా ఉంటున్నది. తాజాగా అమలపాల్ సహజీవనం చేస్తున్నారనే వార్త వైరల్‌గా మారింది. ఇంతకు ఆమె ఎవరితో సహజీవనం చేస్తున్నారంటే..

 పెళ్లితో షాకిచ్చిన అమలాపాల్

పెళ్లితో షాకిచ్చిన అమలాపాల్

టాలీవుడ్‌లో నాయక్, ఇద్దరు అమ్మాయిలతో లాంటి విజయాలతో దూసుకెళ్తున్న సమయంలో అభిమానులకు అందాల తార అమలాపాల్ షాకిచ్చారు. కెరీర్ మంచి రేంజ్‌లో ఉండగా తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు నెలకొనడం.. అవి పరిష్కరించుకోలేనంతగా ఉండటంతో విజయ్, అమలాపాల్ విడిపోయారు.

 అమలాపాల్‌పై ఆగని రూమర్లు

అమలాపాల్‌పై ఆగని రూమర్లు

దర్శకుడు విజయ్‌తో విడిపోయినప్పటి నుంచి అమలా పాల్ పూర్తిగా కెరీర్‌పైనే దృష్టిపెట్టినా.. ఆమెపై గాసిప్స్ మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం గాయకుడు, ముంబైకి చెందిన భవిందర్ సింగ్‌తో ప్రేమలో పడ్డారని, వారిద్దరి చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారనే వార్తలు ఇటు దక్షిణాది మీడియాలోనూ అటూ ఉత్తరాది మీడియాలోను తరుచుగా కనిపిస్తున్నాయి.

సింగర్‌తో అమలాపాల్ సహజీవనం

సింగర్‌తో అమలాపాల్ సహజీవనం

అమలాపాల్, భవిందర్ సింగ్ కలిసి ఉన్న ఫొటోలు ఓ ఇన్స్‌టాగ్రామ్‌ అకౌంట్‌లో వెలుగు చూశాయి. వారిద్దరు సహజీవనం చేస్తున్నారడానికి బలం చేకూర్చేలా ఉన్నాయి. అయితే వాటిని వెంటనే తీసివేయడంతో అనేక అనుమానాలు తలెత్తాయి. భవిందర్ సింగ్ అఫీషియల్ అకౌంటా? లేకా బినామీ పేరుతో దానిని నడిపిస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది.

ఉద్దేశపూర్వకంగానే లీక్ చేశారా?

ఉద్దేశపూర్వకంగానే లీక్ చేశారా?

అయితే తమ ఫొటోలను అమలాపాల్, భువిందర్ సింగ్ ఉద్దేశపూర్యకంగా లీక్ చేశారా? లేదా మరెవరన్నా వాటిని ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టారా? అనే కోలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది. భవిందర్ సింగ్‌తో అమలా పాల్‌కు ఉన్న రిలేషన్‌ను ధృవీకరించేందుకు చేసిన ప్రయత్నామా? అనే మాట కూడా వినిపిస్తున్నది. ఈ పోస్టింగ్ మీద స్పష్టమైన అవగాహన మాత్రం ఇంకా రాలేదు.

Recommended Video

Samantha Akkineni Comments On Amala Paul's Aame Teaser || Filmibeat Telugu
 గాఢంగా కౌగిలించుకొని అతిసన్నిహితంగా

గాఢంగా కౌగిలించుకొని అతిసన్నిహితంగా

భవిందర్ సింగ్ అఫీషియల్ అకౌంటా? అనే విషయాన్ని పక్కన పెడితే.. అమలాపాల్‌, భవిందర్ సింగ్ గాఢంగా కౌగిలించుకొని, అతిసన్నిహితంగా కనిపించిన ఫొటోలు మాత్రం నెటిజన్లకు కిక్కు ఇచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఆ ఫోటోలు వెంటనే తీసివేయడంతో మీడియా చేతికి అవి చిక్కలేదు. ఏదిఏమైనా కొన్ని రోజులుగా వస్తున్న అమలాపాల్ సహజీవనం, డేటింగ్ ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా ఆ ఫోటోలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X