For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటి వాటికిదే సరైన సమయం.. బీచ్‌లో విన్యాసాలు.. అమలాపాల్ షాకింగ్ పిక్స్

    |

    అమలాపాల్‌ పేరు ఈ మధ్య తరుచుగా వినిపిస్తూ ఉంటోంది. అది పెళ్లి వార్తలైనా కావొచ్చు.. హాట్ హాట్ పిక్స్‌ను షేర్ చేస్తూ కావొచ్చు.. కారణం ఏదైనా అమలాపాల్ వార్తలు మాత్రం తెగ వైరల్ అవుతోన్నాయి. రెండో పెళ్లి సీక్రెట్‌గా జరిగిందంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి ఆ మధ్య.. అవి పెళ్లి ఫోటోలు కావని అమలా పాల్ ఖండించింది కూడా. అయితే అప్పటికే ఆ వార్తలు దావానలం వ్యాప్తి చెందాయి. తాజాగా ఆమె షేర్ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

    ఆమె చిత్రంతో రూటే మారింది..

    ఆమె చిత్రంతో రూటే మారింది..

    ఆమె చిత్రంతో అమలా పాల్ రూటే మారిపోయింది. అప్పటి వరకు అందాల ఆరబోతకు దూరంగా ఉండే అమలాపాల్ ఆమె చిత్రంలో ఏకంగా నగ్నంగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలా అప్పటి నుంచి అమలాపాల్ ఏదో రకంగా వార్తలో నిలుస్తూనే ఉంది.

    ప్రేమ, పెళ్లి, విడాకులు..

    ప్రేమ, పెళ్లి, విడాకులు..

    అమలాపాల్ జీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు వెంటవెంటనే జరిగిపోయాయి. దర్శకుడు విజయ్‌తో పీకల్లోతూ ప్రేమలో మునిగి పెళ్లి చేసుకుంది. కుటుంబంలో వచ్చిన మనస్పర్ధల వల్ల విడియామని, తమ మధ్య ఎలాంటి గొడవలు రాలేదని చెప్పుకొచ్చింది. అలా అక్కడితో ఆ కథ మగిసింది.

    అంతవరకు రూమర్స్ ఆపండి..

    అంతవరకు రూమర్స్ ఆపండి..

    తాజాగా తన రెండో పెళ్లిపై వస్తోన్న వార్తలపై అమలా పాల్ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం నా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాను. అవి పూర్తైన వెంటనే నా పెళ్లి గురించి ప్రకటిస్తాను. నా ప్రేమ గురించి చెప్పాను.. పెళ్లి గురించి కూడా చెబుతాను.. అయితే అప్పటి వరకు నా పెళ్లిపై రూమర్స్‌ను క్రియేట్ చేయకండి. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా'ని తెలిపింది.

    బీచ్‌లో యోగా విన్యాసాలు..

    తాజాగా బీచ్‌లో యోగా విన్యాసాలు చేస్తోన్న ఫోటోలను షేర్ చేస్తూ ఓ సుధీర్థ పోస్ట్ చేసింది. ఇదే సరైన సమయం అని, మొక్కలు నాటాలని, మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవాలని ఇలా ఏదేదో రాసుకొచ్చింది. అయితే షేర్ చేసిన ఫోటోల ముందు చెప్పిన ఆ కహానీ చిన్నబోయింది. అందరూ ఆమె విన్యాసాలనే చూశారు.

    English summary
    Amala Paul Doing Yoga At Beach. She Says That A time to set your INTUTIONS, like planting seeds. I have been following this POWERFUL RITUAL during #newmoon to take some time to myself, be introspective and bring to the surface everything I want to RESET, REALIGN and INITIATE in my life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X