Amala Paul: తల్లైనా అందాల ఆరబోతలో తగ్గేదేలే.. బన్నీ హీరోయిన్ బోల్డ్ వీడియో వైరల్..
Amala Paul: రోజురోజుకు సోషల్ మీడియా వాడకం పెరిగేకొద్దీ.. సినీ సెలబ్రిటీలు కూడా తమ ఫ్యాన్స్ కు దగ్గర కావాలని, తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను తరచూ పంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది తారలు తమ గ్లామర్ షో తో ఫాన్స్ ను అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. సినిమాల్లో సంప్రదాయ పాత్రలు చేసే హీరోయిన్లు కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాలను ఆరబోస్తున్నారు. అందులో సౌతిండియన్ బ్యూటీ అమలా పాల్ ఒకరు. తరుచు సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ హాట్ వీడియోను అమలా పాల్ వదిలింది. మీరూ కూడా లుక్కేయండి!
హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ ' ప్రేమ ఖైదీ' అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత సిద్ధార్థ్ తో కలిసి 'లవ్ ఫెయిల్యూర్' అనే సినిమాలో నటించింది. ఇక ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, రామ్ చరణ్ సరసన నటించి తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా తెలుగు, తమిళ సినిమాల ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.

ఈ తరుణంలో కోలీవుడ్ స్టార్స్ ధనుష్,విజయ్ వంటి హీరోల సరసన నటించి, మెప్పించింది. ఇక వీటితో పాటు.. కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి అమలాపాల్ నటించింది. అమలాపాల్ తన కెరీర్ మంచి ఫాంలో ఉండగా.. ఆమె అనే సినిమాలో న్యూడ్ గా నటించి ప్రేక్షకులకు షాకిచ్చింది. ఇక ఈ సినిమా అప్పట్లో వివాదాస్పదం కూడా అయింది. ఈ మూవీ తమిళ,తెలుగు కు విడుదలైంది. కానీ నెటిగివ్ టాక్ సొంతం చేసుకుంది.
వాస్తవానికి తెలుగులో ఆమె చేసిన సినిమాలు దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి. కానీ, ఈ బ్యూటీకి మాత్రం సరైన ఆఫర్లు రాలేదు. ఈ క్రమంలో పూర్తిగా తమిళం, మలయాళం చిత్రాలకే పరిమితమైపోయింది. కోలీవుడ్ లో అగ్రకథానాయికగా మంది పేరు వస్తున్న సమయంలో కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలాపాల్. సినిమాలకు దూరమైంది. కానీ వీరి వివాహ బంధం మూడునాళ్ళ ముచ్చటగా మారింది. కేవలం 3 ఏళ్లలో విడిపోయారు. విడాకుల అనంతరం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అలరిస్తోంది.
గతేడాది స్నేహితుడు, వ్యాపారవేత్త జగత్ దేశాయ్ ను కేరళలోని కొచ్చిలో రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఈ ఏడాది జూన్లో కొడుకు పుట్టాడు. కొడుకు పేరు ఇళయ్. అమల చివరిసారిగా పృథ్వీరాజ్ సుకుమారన్, దర్శకుడు బ్లెస్సీ కాంబోలో వచ్చిన ఆడుజీవితంలో కనిపించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటుంది. నిత్యం ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలు చేస్తుంది. పెళ్లి తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫోటోలు, తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.
ఇలా తాజాగా ఓ హాట్ వీడియోను అమలా పాల్ వదిలింది. ఇటీవల ఈ బ్యూటీ తన ఫ్యామిలీతో కలిసి బాలి టూర్ కు వెళ్లింది. ఇక్కడ తన బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. భర్త, తన బిడ్డతో కలిసి హ్యాపీగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ బీచ్, స్వీమింగ్ పుల్ లో డ్యాన్స్ చేస్తూ.. నేచర్ ఎంజాయ్ చేస్తున్నది అమలా పాల్. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరలవుతోంది. దీంతో పెళ్ళైనా..తల్లైనా.. ఈ అమ్మడు అందాల ఆరబోతలో తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తోంది గా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











