అమలా పాల్ హై డోస్ గ్లామర్.. ఇద్దరు మగవాళ్లతో షాకింగ్ పిక్స్.. ఎంత అంటూ!
అక్కినేని నాగ చైతన్య బెజవాడ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై సిద్ధార్థ్ హీరోగా నటించిన లవ్ ఫెయిల్యూర్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కేరళ బ్యూటి అమలా పాల్. ఈ సినిమాలో సాదాసీదాగా కాలేజ్ స్టూడెంట్ గా కనిపించి ఆకట్టుకున్న ఈ మలయాళి భామ తర్వాతి సినిమాల్లో గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది.
అయితే పలు అగ్ర హీరోలతో జత కట్టినా కూడా ఈ బ్యూటి అంతగా క్లిక్ కాలేదు. తర్వాత ఓటీటీ సినిమాలతో సందడి చేసి కాస్తా ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరే అందాలతో కవ్విస్తూ ఫొటోలు పోస్ట్ చేస్తోంది. ఆ ఫొటోలు ఎలా ఉన్నాయని చూస్తే..

కొచ్చిలో: బ్యూటిఫుల్ అమలా పాల్ అసలు పేరు అనఖ. కేరళలోని ఎర్నాకులంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ తండ్రి వర్గీస్ పాల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి అన్నీస్ పాల్ గృహిణి. అమలా పాల్ కు ఒక అన్నయ్య ఉండగా వీరి కుటుంబం కొచ్చిలో స్థిరపడింది. అక్కడే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. తర్వాత 2009లో ఇంటర్ అయ్యాక.. ఇంజినీరింగ్ లో చేరేందుకు ఒక సంవత్సరం విరామం తీసుకుంది.

నటనకు ప్రశంసలు: ఇంజినీరింగ్ కు ఒక ఏడాది బ్రేక్ ఇచ్చిన సమయంలోనే అమలా పాల్ పిక్స్ చూసిన మలయాళ డైరెక్టర్ లాల్ జోస్ 'నీల తామర' చిత్రంలో ఒక చిన్న పాత్ర కోసం సెలెక్ట్ చేశాడు. అయితే ఆ మూవీ హిట్ కాకపోయినప్పటికీ అమలా పాల్ పాత్రకు, ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అనంతరం తమిళ కామెడీ చిత్రం వికడకవిలో ఓ పాత్రలో నటించింది అమలా పాల్.

తమిళ చిత్రాలు: ఇక అమలా పాల్ నటించిన వికడకవి సినిమా చాలా ఆలస్యంగా విడుదలైంది. ఈ సినిమా అమలా పాల్ ఆరో చిత్రంగా రిలీజైంది. ఈ మధ్యలో వీర శేఖరన్, సింధు సామవేళి వంటి తమిళ చిత్రాల్లో నటించింది అమలా పాల్. అయితే సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళి సినిమాలో అమాలా పాల్ పోషించన సుందరి పాత్ర వివాదాలను సృష్టించింది.

అక్రమసంబంధం: సింధు సామవేళి మూవీలో మామగారితో అక్రమ సంబంధాన్ని కొనసాగించే కోడలి పాత్రలో నటించింది అప్పట్లో పెద్ద కాంట్రవర్సికి తెరలేపింది అమలా పాల్. తర్వాత ఆమె చేసిన మైనా సినిమాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే తెలుగులోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ.

పెళ్లి-విడాకులు: అక్కినేని నాగ చైతన్య 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన 'నాయక్' మినహా 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' సినిమాలు హిట్ కొట్టలేదు. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమాయణం సాగించింది. అనంతరం పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న వీరు నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు.

నెటిజన్ల ఆరా: ఇలా సినిమాలు, కాంట్రవర్సీలతో సెన్సేషన్ అయిన గ్లామరస్ బ్యూటి అమలాపాల్ సోషల్ మీడియాలో సూపర్ గ్లామర్ ట్రీట్ అందిస్తుంటుంది. తాజాగా స్లీవ్ లెస్ పొట్టి దుస్తుల్లో షేడ్స్ పెట్టుకుని చాలా ఘాటుగా మత్తెక్కే చూపులతో పోజులిచ్చింది. ఇందులో ఆమె చేసిన స్కిన్ షో కనువిందు చేస్తోంది. అలాగే అమలా పాల్ వెనుక ఉన్న ఇద్దరు ఎవరంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అలాగే నీ ట్రావెల్ కు ఎంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











