బాలయ్య కోసం లస్ట్ స్టోరీస్ హీరోయిన్.. హాట్ బ్యూటీని సెట్ చేసిన బోయపాటి

టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని చేజిక్కించుకొనేందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటి జతకట్టడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. దర్శకుడు బీ గోపాల్ తర్వాత బాలకృష్ణను అంత కొత్తగా, విభిన్నంగా చూపించడంలో బోయపాటిని మించిన వారెవరూ ఉండరనేది ఇండస్ట్రీలో టాక్. ఆ క్రేజ్‌తోనే ఇప్పుడు బాలయ్య సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే బాలయ్య పక్కన హీరోయిన్లను సెట్ చేయడంలో బోయపాటి స్టైల్ వేరు అనే విషయాన్ని విభిన్నంగా చెప్పుకొంటారు. అలాంటి స్టాండర్ట్స్‌ను మెయింటెన్ చేయడానికి బోయపాటి తాజా చిత్రంలో హీరోయిన్ల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే..

క్రేజీగా బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌

క్రేజీగా బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌

బాలకృష్ణ, బోయాపాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం షూటింగ్ దశలోనే ఉండగానే భారీ క్రేజ్ కనిపిస్తున్నది. ఒకే ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత కరోనావైరస్ పరిస్థితులు నెలకొనడంతో షూటింగును నిరవధికంగా నిలిపివేశారు. లాక్‌డౌన్ సడలింపల తర్వాత సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్దామని అనుకొన్నారు. కానీ పరిస్థితులు మరింత దిగజారడంతో షూటింగ్ చేయడానికి నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు.

బాలయ్య బర్త్ డే రోజున

బాలయ్య బర్త్ డే రోజున

ఇక బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని బోయపాటి శ్రీను డైలాగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. డైలాగ్స్‌తో కేక పెట్టించే విధంగానే టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానుల్లో జోష్‌ను పెంచి ఉత్సాహాన్ని నింపింది. ఇక టీజర్ తర్వాత అభిమానుల్లో జోష్ నింపే వార్తను బోయపాటి అందించేందుకు సిద్ధమయ్యారు. హీరోయిన్ ఎంపికను పూర్తి చేసినట్టు తెలుస్తున్నది.

బాలయ్యతో అమలాపాల్

బాలయ్యతో అమలాపాల్

ఇటీవల బాలకృష్ణ సరసన నటించాలని బోయపాటి బృందం హీరోయిన్ అమలాపాల్‌ను సంప్రదించినట్టు తెలిసింది. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారని, ఆ చిత్రంలో నటించడానికి అభ్యంతరం ఏమీ లేదనే విషయాన్ని చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమెతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఒకసారి చర్చలు పూర్తయిన తర్వాత అధికారికంగా అమలాపాల్ పేరు వెల్లడిస్తారని తెలిసింది.

అమలాపాల్ కెరీర్ విషయానికి వస్తే..

అమలాపాల్ కెరీర్ విషయానికి వస్తే..

అమలాపాల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మలయాళంలో అడుజీవితం అనే చిత్రంలో దర్శక, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వివాదాస్పద కథాంశంతో రూపొందుతున్నది. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకుడు బ్లెస్సీ రూపొందిస్తున్నారు. అలాగే తమిళ, మలయాళ వెర్షన్‌లో వస్తున్న హిందీ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్‌లో నటిస్తున్నారు.

Recommended Video

Nandamuri Mokshagna Is Not Ready Yet, Latest Look Goes Viral
పర్వీన్ బాబీ బయోపిక్‌లో అమలాపాల్

పర్వీన్ బాబీ బయోపిక్‌లో అమలాపాల్

ఇక అమలాపాల్ హిందీ చిత్రంలో కూడా నటించేందుకు సిద్ధమవుతున్నారు. అలనాటి ప్రముఖ తార పర్వీన్ బాబీ జీవిత కథాంశంగా రూపొందే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ డైరెక్టర్‌గా వ్యవరిస్తున్నారు. త్వరలోనే పర్వీన్ బాబీ బయోపిక్‌కు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నది. కరోనావైరస్ పరిస్థితులు సద్దుమణిగితే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X