Don't Miss!
- Lifestyle
Yoga For Eyes: కంటి యోగా.. చూపు మెరుగవుతుంది, ఇంకా ఎన్నో లాభాలు
- News
జగన్ ను సైకో అనలేదు- వీడియోలో కామెంట్స్ కరెక్టే ! దుట్టా రామచంద్రరావు క్లారిటీ..
- Finance
Dhirubhai Ambani: 1982 సీన్ రిపీట్.. అంబానీలు ఎదుర్కొన్న పరిస్థితే అదానీకి.. స్పెషల్ స్టోరీ..
- Sports
INDvsNZ : పేపర్ ప్లేన్‌తో ఆడుకుంటున్న సూర్యకుమార్ యాదవ్.. వీడియో వైరల్!
- Technology
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఎద అందాలతో అమలా పాల్ హాట్ షో: అక్కడ పుట్టుమచ్చ చూపిస్తూ ఘోరంగా!
అక్కినేని నాగ చైతన్య బెజవాడ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై సిద్ధార్థ్ హీరోగా నటించిన లవ్ ఫెయిల్యూర్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కేరళ బ్యూటి అమలా పాల్. ఈ సినిమాలో సాదాసీదాగా కాలేజ్ స్టూడెంట్ గా కనిపించి ఆకట్టుకున్న ఈ మలయాళి ముద్దుగుమ్మ తర్వాతి సినిమాల్లో గ్లామర్ తో అట్రాక్ట్ చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జోడి కట్టిన నాయక్ మూవీ హిట్ సాధించిన ఆ తర్వాత ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటి ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో తనవైపుకు తిప్పుకుంటోంది బ్యూటిఫుల్ అమలా పాల్.

ఇంజినీరింగ్ కు గ్యాప్..
బ్యూటిఫుల్ అమలా పాల్ అసలు పేరు అనఖ. కేరళలోని ఎర్నాకులంలో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. తండ్రి వర్గీస్ పాల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి అన్నీస్ పాల్ గృహిణి. అమలా పాల్ కు ఒక అన్నయ్య ఉండగా వీరి కుటుంబం కొచ్చిలో స్థిరపడింది. అక్కడే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. తర్వాత 2009లో ఇంటర్ అయ్యాక.. ఇంజినీరింగ్ లో జాయిన్ అయేందుకు ఒక సంవత్సరం విరామం తీసుకుంది.

నీల తామర చిత్రంలో చిన్న పాత్రతో..
ఇంజినీరింగ్ గా ఒక ఏడాది బ్రేక్ ఇచ్చిన సమయంలోనే అమలా పాల్ ఫొటోలు చూసిన మలయాళ డైరెక్టర్ లాల్ జోస్ మూవీ 'నీల తామర' చిత్రంలో ఒక చిన్న పాత్ర కోసం ఎంచుకున్నారు. అయితే ఆ మూవీ హిట్ కాకపోయినప్పటికీ అమలా పాల్ పాత్రకు, ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అనంతరం తమిళ కామెడీ చిత్రం వికడకవిలో ఓ పాత్రలో నటించింది అమలా పాల్.

వివాదస్పద పాత్రలో..
అమలా పాల్ నటించిన వికడకవి సినిమా చాలా ఆలస్యంగా విడుదలైంది. ఈ మూవీ అమలా పాల్ ఆరో చిత్రంగా రిలీజైంది. ఈ మధ్యలో వీర శేఖరన్, సింధు సామవేళి వంటి తమిళ చిత్రాల్లో నటించింది అమలా పాల్. అయితే సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళి సినిమాలో అమాలా పాల్ పోషించన సుందరి పాత్ర వివాదాలను సృష్టించింది. ఇందులో మామగారితో అక్రమ సంబంధాన్ని కొనసాగించే కోడలి పాత్రలో నటించింది అమలా పాల్.

నాయక్ తప్పా ఆకట్టుకోని చిత్రాలు..
అమలా పాల్ మైనా సినిమాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆమెకు వరుసగా ఆఫర్లు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే తెలుగులోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. అక్కినేని నాగ చైతన్య 'బెజవాడ' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి పరిచయమైంది. కానీ ఇది ఆమెకు సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఈమె నటించిన 'నాయక్' మినహా 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' సినిమాలు హిట్ కొట్టలేదు.

నాలుగేళ్లకు విడాకులు..
తెలుగు, తమిళం, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోన్న సమయంలోనే అమలా పాల్.. దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమాయణం సాగించింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ సాగించిన ఈ ఇద్దరూ.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. అప్పట్లో ఈ అంశం నేషనల్ రేంజ్‌లో హైలైట్ అయింది.

స్పీడ్ పెంచిన అమలా..
డైరెక్టర్ విజయ్‌తో పెళ్లి జరిగిన తర్వాత అమలా పాల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ, అతడికి విడాకులు ఇచ్చేసిన తర్వాత మాత్రం వరుసగా మూవీలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం 'ఆమె/అడై' అనే సినిమాలో నగ్నంగా నటించి రచ్చ చేసింది. సినిమాలకు కొంతకాలం గ్యాప్ తీసుకున్న కేరళ కుట్టి అమలా పాల్ ఇప్పుడు మంచి స్పీడ్ తో సినిమాలు చేస్తోంది. విభిన్నమైన స్టోరీస్ ను సెలెక్ట చేసుకుంటూ వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది.

ఎద భాగంపై పుట్టుమచ్చతో..
సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో సైతం హాట్ ఫొటోలు, వీడియోలతో రచ్చ చేస్తోంది కేరళ కుట్టి అమలా పాల్. తాజాగా యెల్లో కలర్ చుడీదార్ వేసుకున్న అమలా పాల్ తన ఎద అందాలను హద్దు లేకుండా పరిచింది. తన ఎద భాగంపై పుట్టుమచ్చ చూపిస్తూ బోల్డ్ నెస్ కు కొత్త అర్థం చెప్పింది బ్యూటిఫుల్ అమలా పాల్. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫొటోలకు 'కొంచెం సన్ షైన్ ను నాతో పట్టుకొస్తున్నా' అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటి.