సెకండ్ మ్యారేజ్ ఆలోచనలో అమలాపాల్.. అసలు విషయం చెబుతూనే షాకింగ్ ట్విస్ట్!

ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకున్న నటీనటులు మళ్లీ పెళ్లి చేసుకుంటున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఒకసారి విడాకులు అయిన తర్వాత చాలా మంది నటీనటులు రెండో పెళ్ళికి, మూడో పెళ్ళికి కూడా సిద్ధమవుతున్నారు. ఇదే కోవలో ఇప్పుడు తాజాగా హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లికి సిద్ధమవుతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ కేరళ పుట్టి త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

బెజవాడ

బెజవాడ

కేరళలోని అలువ అనే ప్రాంతంలో జన్మించింది అమలాపాల్. ఆమె చదువు కూడా అక్కడే పూర్తి చేసింది. తర్వాత మలయాళ సినిమాల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత తమిళ సినిమాల్లో కూడా కనిపించింది. ఇక అలా తమిళ, మళయాళ సినిమాలు చేసిన తర్వాత రెండో సంవత్సరంలో ఆమెకు తెలుగులో బెజవాడ అనే సినిమాలో గీతాంజలి అనే పాత్రలో నటించే అవకాశం దక్కింది.

2017 వ సంవత్సరంలో

2017 వ సంవత్సరంలో


ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. తెలుగులో లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఆమె కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలోనే ఆమె ఏఎల్ విజయ్ అనే ఒక దర్శకుడుని ప్రేమించి వివాహం చేసుకుంది. మూడేళ్ల పాటు సాగిన వీరి వివాహ జీవితం 2017 వ సంవత్సరంలో బీటలు వారింది.

రెండో వివాహం

రెండో వివాహం


వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఆ తర్వాత విజయ్ మరో యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అమలాపాల్ మాత్రం వివాహాల జోలికి వెళ్లకుండా ఉన్నారు. ఆయన పెళ్లి జరుగుతున్న సమయంలోనే అమలాపాల్ కూడా రెండో వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ దానిమీద అమలాపాల్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

తర్వాతే పెళ్లి గురించి

తర్వాతే పెళ్లి గురించి


ఇటీవల సోషల్ మీడియాలో అమలాపాల్ తన అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించిన సమయంలో ఒక అభిమాని ఆమె సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. మిమ్మల్ని పెళ్లి చేసుకునే అబ్బాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని ప్రశ్నించగా తనకి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తనను తాను ఆవిష్కరించుకునే పనిలో ఉన్నానని అమలాపాల్ వెల్లడించింది. అంతేకాదు తనను తాను ఆవిష్కరించుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచించడం మొదలు పెడతానని అప్పుడే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తానని అమలాపాల్ పేర్కొనడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..

మంచి లేడీ ఓరియంట్ స్క్రిప్స్ కోసం

మంచి లేడీ ఓరియంట్ స్క్రిప్స్ కోసం


నా మీద నేను క్లారిటీ తీసుకోవాలని ఆ తర్వాత మాత్రమే మీకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అమలాపాల్ వెల్లడించింది. పూర్తిగా పెళ్లి మీద ఆమెకు నెగిటివ్ అభిప్రాయం లేదని ఖచ్చితంగా పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఆమె కామెంట్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మళ్లీ కుటుంబ జీవితంలోకి ఎంట్రీ ఇస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి అమలాపాల్ కమర్షియల్ సినిమాలు కంటే ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. విడాకుల తరువాత ఆమె చేసిన కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మంచి పేరు తెచ్చుకున్న నేపథ్యంలో ఎక్కువగా అలాంటి సినిమాలు చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో మంచి లేడీ ఓరియంట్ స్క్రిప్స్ కోసం చూస్తున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X