అందుకే విడాకులు తీసుకొన్నా.. భర్తతో విభేదాలపై గుట్టువిప్పిన అమలాపాల్

బాహుభాషా నటి అమలాపాల్ సినిమాలు, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు. తాజాగా పిట్టకథలు అనే వెబ్ సిరీస్ అంథాలజీలో నటించి మెప్పించారు. అమలాపాల్ నటనపై సినీ విమర్శకులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలాపాల్ మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు చర్చించారు. ఆ వివరాల్లోకి వెళితే..

దర్శకుడు ఏఎల్ విజయ్‌తో విడాకులు

దర్శకుడు ఏఎల్ విజయ్‌తో విడాకులు

తన కెరీర్ తొలినాళ్లలో అమలాపాల్ తమిళ, తెలుగు,మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడ్డారు. అయితే తన కెరీర్ పీక్‌లో ఉండగానే ఏఎల్ విజయ్‌తో వివాహం జరిగింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయి దాంపత్య జీవితానికి ముగింపు పలికారు.

బాలీవుడ్ గాయకుడితో పెళ్లి రూమర్లు

బాలీవుడ్ గాయకుడితో పెళ్లి రూమర్లు

ఆ తర్వాత కొద్ది రోజులకు బాలీవుడ్ గాయకుడు భవిందర్ సింగ్‌తో డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అలాంటి వార్తల మధ్య ఓ సందర్భంలో పెళ్లి చేసుకొన్నట్టు భవిందర్ సింగ్ తమ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే భవిందర్ సింగ్ తనను మోసగించి ఆ ఫోటోలను పోస్టు చేశారు. మా మధ్య పెళ్లి లాంటిది ఏమీ లేదని చెప్పడంతో వివాదం ముగిసింది.

పిట్టకథలు వెబ్ సిరీస్‌లో జగపతిబాబుతో

పిట్టకథలు వెబ్ సిరీస్‌లో జగపతిబాబుతో

అప్పటి నుంచి అఫైర్లు, డేటింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటూ కెరీర్‌పై దృష్టి పెట్టారు. తాజాగా పిట్టకథలు అనే వెబ్ సిరీస్‌ను తెలుగులో చేశారు. అందులో ఓ ఎపిసోడ్‌లో ఎప్పుడూ భర్త అనుమానించే భార్య జగపతిబాబు‌తో కలిసి అమలాపాల్ నటించారు. తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రను పోషించినట్టు ప్రేక్షకులకు స్పష్టమైంది.

నా భర్తతో విడిపోవాలనుకొన్నప్పుడు

నా భర్తతో విడిపోవాలనుకొన్నప్పుడు

పిట్టకథలులోని తన పాత్ర దృష్టిలో పెట్టుకొని తన నిజ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటనలను గుర్తు చేసుకొన్నారు. ఏఎల్‌ విజయ్‌తో విభేదాలు నెలకొని విడిపోవాలని అనుకొన్నప్పుడు నన్ను అందరూ భయపెట్టారు. నాకు అండగా ఎవరూ నిలువలేదు. నా సంతోషాన్ని, నా మానసిక సంఘర్ణణను ఎవరూ పట్టించుకోలేదు అని అమలాపాల్ షేర్ చేసుకొన్నారు.

అమలాపాల్ కెరీర్ ఇలా...

అమలాపాల్ కెరీర్ ఇలా...

ఇక అమలాపాల్ కెరీర్ విషయానికి వస్తే.. 2021లో ఆమె జోరు మొదలైంది. 2021లో కుట్టి స్టోరి, పిట్ట కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం అధో ఆంధా పరవాయి పోలా, ఆడు జీవితం, పరాణ్ణు పరాణ్ణు, పరాణ్ణు, కాడవెర్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X