నగ్నంగా నటించేటప్పుడు 15 మందితో.. కంగారు పడొద్దని చెప్పా.. అమలా పాల్
Recommended Video
దక్షిణాది అందాల భామ అమలా పాల్ ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్నారు. అడై అనే చిత్ర టీజర్‌లో ఆమె నటనపై సినీ విమర్శకులు, సగటు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా అమలా పాల్ నటించిన కామిని పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. వెండితెరపై ఆమె నటనను చూడటానికి ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. నగ్నంగా నటించిన సన్నివేశంపై వస్తున్న కామెంట్ల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడటమే కాకుండా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే..

సినిమాలకు గుడ్‌బై చెప్పాలనే సమయంలో
నేను నటిగా కొనసాగాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు.. నేను సినిమాలకు గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నప్పుడు అడై (ఆమె) సినిమా నా ముందుకు వచ్చింది. అంతకుముందు చాలా మంది హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమా కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఏవీ నచ్చలేదు. అలాంటి సమయంలో ఆడై కథ నన్ను కదింలిచింది అని అమలా పాల్ పేర్కొన్నారు.

న్యూడ్ సీన్ గురించి..
న్యూడ్ సీన్ గురించి అమలా పాల్ మాట్లాడుతూ.. దర్శకుడు రత్న కుమార్ నగ్నంగా ఉన్న సీన్ చేస్తారా అంటే.. మీరే కంగారు పడకండి అని అన్నాను. తీరా సీన్ చేయడాల్సి వచ్చిన విపరీతమైన ఒత్తిడికి లోనయ్యాను. నేను నగ్నంగా ఉండే సమయంలో సెట్లో ఎవరు ఉంటారు. ఏ విధంగా తీస్తారు అనే ఆలోచనలు నన్ను ముంచెత్తాయి అని తెలిపారు.

నగ్నమైన సీన్ తీసే సమయంలో
న్యూడ్ సీన్ తీసేటప్పుడు కొందరిని బయటకు పంపించేశాం. షాట్ తీయడానికి కావాల్సిన కేవలం 15 మందిని సెట్లో ఉంచాం. యూనిట్‌పై నాకు నమ్మకం లేకపోతే ఆ సీన్ చేసి ఉండేదానిని కాదు. సీన్ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయం నన్ను వెంటాడింది. యూనిట్ సభ్యులు చాలా హుందాగా వ్యవహరించారు. దాంతో ఆ సీన్‌లో బాగా నటించాననే ఫీలింగ్ కలిగింది అని అమలాపాల్ పేర్కొన్నారు.

మూవీ టీజర్ చూసిన తర్వాత రియాక్షన్
అడై మూవీ టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకులు రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తారని తెలుసు. ఎవరెలా స్పందిస్తారో అనే విషయం కంట్రోల్ చేయడానికి మన చేతుల్లో ఏమీ లేదు. సినిమాపరంగా చాలా నిజాయితీలో కూడిన అటెంప్ట్ చేశాను. అడై (ఆమె) సినిమా తప్పుకుండా అందరికీ నచ్చుతుంది. సినిమాపై ప్రేక్షకులు ఎలా స్పందిస్తారనే విషయం కోసం ఎదురుచూస్తున్నాను అని అమలా పాల్ చెప్పింది.

ఏమీ ఆశించకుండా మీరు
ఏమీ ఆశించకుండా మీరు చూపిస్తున్న ప్రేమతో ఆనందంలో మునిగి తేలుతున్నాను. నా జీవితంలో సరికొత్త ప్రయాణం మొదలైంది. నా సినిమా కూడా ఘనంగా ఆడాలని నా కోసం మీరు ప్రార్థించండి. మీ అమ్మాయిగా భావించి నాకు విజయాన్ని అందించేలా విష్ చేయండి అంటూ అమలా పాల్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











