పెళ్లికి ముందే తప్పు చేశా.. నా భర్తకు తెలియదు.. ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టిన హీరోయిన్
చిత్ర పరిశ్రమలోని నటీనటులు ఇటీవలి కాలంలో సుదీర్ఘ డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్న ఉదంతాలు ఎక్కువ అవుతున్నాయి. కొందరు పెళ్లికాకుండానే గర్భం దాల్చినప్పటికీ వివాహం మాత్రం చేసుకోకుండా ఉండిపోతున్నారు. మరికొందరు మాత్రం పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఈ కోవలోకే వస్తారు డస్కీ బ్యూటీ అమలాపాల్. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన విషయం గురించి ఆమె బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..
కలిసిరాని టాలీవుడ్
కేరళకు చెందిన అమలాపాల్ 2009లో నీలాతామర చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. అందగత్తె కాకపోయినా తన సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అమల. ఎంతో మంది నటీమణుల కల అయిన జాతీయ అవార్డును చిన్న వయసులోనే కైవసం చేసుకున్నారు. తమిళ, మళయాల భాషల్లో బిజీగా ఉన్న సమయంలో అక్కినేని నాగచైతన్య నటించిన బెజవాడ చిత్రంతో తెలుగువారిని పలకరించింది అమలాపాల్. ఆ తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, పిట్టకథలు వంటి చిత్రాల్లో నటించారు. టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడంతో తన మాతృభాష మలయాళంతో పాటు తమిళ చిత్రాలపైనే ఫోకస్ పెట్టారు అమలాపాల్.

విజయ్‌తో పెళ్లి విడాకులు
హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడిన అమలాపాల్ 2014లో అతనిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే మనస్పర్ధల కారణంగా ఈ జంట కొద్దికాలానికే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన సినిమాలు తాను చేసుకుంటూ కెరీర్‌పైనే ఫోకస్ పెట్టిన అమల.. ఆరేడు సంవత్సరాలు ఒంటరిగానే లీడ్ చేసింది. అయితే అనూహ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్ జగత్ దేశాయ్‌తో ప్రేమలో పడ్డ ఆమె పెద్దల అంగీకారంతో అతనిని పెళ్లాడింది. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగత్‌తో ప్రేమాయణం, ప్రెగ్నెన్నీ, పిల్లలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్
గోవాలో తను జగత్‌ను కలిశానని.. అతను దక్షిణాది చిత్రాలు చూడకపోవడం వల్ల నేను హీరోయిన్ అనే విషయం తెలియదని అమలాపాల్ తెలిపారు. నా పుట్టినరోజును ఓ పెద్ద పండగలా సెలబ్రేట్ చేసి పార్టీ ఏర్పాటు చేశాడని, అప్పుడే జగత్ నాకు ఉంగరంతో ప్రపోజ్ చేసినట్లు వెల్లడించింది. అప్పటికే అతని ప్రవర్తన, మంచితనం, వ్యక్తిత్వం నచ్చి జగత్‌పై అభిమానం ఏర్పడి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అమలాపాల్ తెలిపింది. పెళ్లికి ముందే జగత్ దేశాయ్‌తో శారీరకంగా కలవడంతో తాను గర్భం దాల్చినట్లు అమల తెలిపారు. ఆ తర్వాత కొద్దిరోజులకే పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యామని అమలాపాల్ పేర్కొన్నారు.
పెళ్లి తర్వాత బిజీగానే
పెళ్లి తర్వాతే తాను హీరోయిన్ అన్న విషయం తెలియడంతో జగత్ షాకయ్యాడని.. నువ్వు హీరోయిన్ అని ఎందుకు చెప్పలేదని అడిగాడని గుర్తుచేసింది. ఆ తర్వాత అమల పండంటి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అమలాపాల్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. గతేడాది ది గోట్ లైఫ్, లెవల్ క్రాస్ సినిమాలతో సందడి చేశారు. ది గోట్ లైఫ్‌లో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ఇంటిమేట్ సీన్స్‌లోనూ అమల రెచ్చిపోయారు. ప్రస్తుతం ఆమె ద్విజ అనే సినిమాలు నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











