ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి .. ఆ జ్యోతిష్కుడి మాట నిజమైందంటున్న హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో డేటింగ్‌లు, లవ్ అఫైర్లు, బ్రేకప్పులు, విడాకులు కొత్తేమీ కాదు. కొందరు తమ రిలేషన్‌ను గుట్టుగా కొనసాగిస్తే.. మరికొందరు మాత్రం ఏదీ దాచుకోకుండా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు. అలా రెండో కోవలోకే వస్తుంది కేరళ బ్యూటీ అమలాపాల్ (Amala Paul). మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అమల... తన ప్రొఫెషనల్ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇంతకీ ఏమన్నారంటే?

అమలాపాల్.. రామ్ చరణ్ నటించి 'నాయక్' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తరువాత అల్లు అర్జున్‌తో 'ఇద్దరమ్మాయిలతో', నాని సరసన 'జెండాపై కపిరాజు', నాగచైతన్యతో 'బెజవాడ' సినిమాల్లో నటించి మెప్పించింది. కెరీర్ తొలి రోజుల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తూ హోమ్లీగా కనిపించిన అమలాపాల్.. ఆ తర్వాత గ్లామర్ రూట్‌లోకి వెళ్లి పూర్తిగా భిన్నమైన ఇమేజ్ క్రియేట్ చేశారు. అలాగే.. తరుచూ కొన్ని కామెంట్లతో వివాదాల్లోనూ తలదూర్చింది.

Amala Paul Reveals Shocking Pregnancy Before Marriage After Astrologer Prediction

కెరీర్ ప్రారంభంలోనే డైరెక్టర్ ఏఎల్ విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్.. మూడేళ్లు తిరగకముందే ఆయనతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం వరుస సినిమాలు చేస్తూ సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేశారు. ఇక 2023లో బిజినెస్‌మ్యాన్ జగత్ దేశాయ్ (Jagat Desai)ను రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఈ దంపతులకు 2024లో ఓ మగబిడ్డ జన్మించాడు. ఇటు సినీ కెరీర్.. అటు పర్సనల్ లైఫ్ ను లీడ్ చేస్తూ..సక్సెస్ పుల్ గా ముందుకు సాగుతోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న అమలాపాల్, ఓ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఆమె మాట్లాడుతూ... 'జీవితం మామూలుగానే సాగుతున్న సమయంలో ఓ జ్యోతిష్కుడిని కలిశాను. ఆయన నాకు 32 ఏళ్ల వయసులో పెళ్లి జరుగుతుందని చెప్పారు. అప్పటికి నాకు బాయ్‌ఫ్రెండ్ కూడా లేకపోవడంతో అది అసాధ్యమే అనుకున్నాను. కానీ ఆయన చెప్పిన కొన్ని రోజులకే గోవాలో జగత్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది, మేం డేటింగ్ మొదలుపెట్టాం'అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ... ఆ సమయంలో తాను అసలు పెళ్లి చేసుకునే ఆలోచనలోనే లేనని కూడా చెప్పారు. అయితే ఆ రిలేషన్‌షిప్ సమయంలో తాను గర్భవతి కావడంతో పరిస్థితులు మారిపోయాయని అమల పాల్ తెలిపారు. 'మొదట్లో నాకు పెళ్లి ప్లాన్ ఏమీ లేదు. కానీ ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి తప్పనిసరి అయిపోయింది' అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ అమలాపాల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమలాపాల్ తన జీవితంలో జరిగిన అనూహ్య మలుపులు, ప్లాన్ లేకుండా మొదలైన పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత ప్రెగ్నెంట్,పెళ్లి ఇవన్నీ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాయి.

More from Filmibeat

Read more about: amala paul jagat desai tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X