‘శృంగారంలో ఆ తప్పుతో ప్రెగ్నెన్సీ.. బలవంతంగా పెళ్లి’

దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రతిభతోపాటు అందం, అభినయంతో ఆకట్టుకొన్న హీరోయిన్లలో అమలాపాల్ అతి కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకొన్నారు. సౌత్‌లో అగ్ర హీరోలతో నటించి మెప్పించారు. గ్లామర్ పాత్రలే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లతో ఆకట్టుకొన్నారు. అయితే తన కెరీర్‌ ఊహించని విధంగా సాగిపోతున్న సమయంలో వ్యక్తిగత సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితంలో కలతలు ఆమె కెరీర్‌కు బ్రేక్ వేశాయి. అయితే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటన గురించి గతంలో మీడియాతో పంచుకొన్నారు. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఆమె తన లైఫ్‌లో జరిగిన విషయాలు, రెండో పెళ్లి గురించి ఏం చెప్పారంటే..

అమలాపాల్ కెరీర్ విషయానికి వస్తే.. 2009 సంవత్సరంలో నీమతామర అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బెజవాడ అనే సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. రాంచరణ్‌తో నాయక్, అల్లు అర్జున్‌తో ఇద్దరు అమ్మాయిలతో సినిమాలో నటించి టాప్ స్టార్‌గా మారింది. అయితే కెరీర్ టాప్‌లో ఉండగానే తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. అయితే కెరీర్‌ను వదులుకొని పెళ్లికి మొగ్గు చూపింది.

Amala Paul Throwback story

కెరీర్ పీక్స్‌లో కొనసాగుతుండగానే దర్శకుడు విజయ్‌ని 2014 సంవత్సరంలో అమలాపాల్ వివాహం చేసుకొన్నారు. వారి దాంపత్య జీవితం మూడేళ్లు సాగింది. ఈ మధ్యకాలంలో దాంపత్యపరమైన విభేదాలు రావడంతో 2017లో విడాకులు తీసుకొన్నారు. అలా ఆమె వైవాహిక జీవితం అర్ధాంతరంగా ముగిసింది.

అయితే ఆ తర్వాత దాదాపు 5 ఏళ్లపాటు సింగిల్‌గానే లైఫ్‌ను లీడ్ చేసింది. ఈ క్రమంలో జగత్ దేశాయ్ అనే పారిశ్రామిక వేత్త, సింగర్‌తో పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేశారు. అయితే వారి అఫైర్ వార్తలు మీడియాలో వైరల్ అవుతుండగా సడెన్‌గా రెండో పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది. అయితే తన రెండో పెళ్లికి కారణాలను ఓ సందర్భంగా బోల్డ్‌గా పంచుకొన్నారు.

జగత్ దేశాయ్‌తో ప్రేమాయణం జోరుగానే సాగింది. ఆయనతో శృంగార జీవితాన్ని ఆస్వాదించింది. వారిద్దరి లిప్‌లాక్, సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో ట్రెండ్ అయ్యాయి. అయితే జగత్ దేశాయ్‌తో నా బంధం గురించి ఓపెన్. దాని గురించి గుసగుసలు ఏమీ లేదు. మనసులు మాత్రమే కాదు శారీరాలు కలిశాయి. దాంతో నాకు అనుకోకుండా గర్బ వచ్చింది. ప్రెగ్నెన్సీ కారణంగా మా పెళ్లి అనుకోకుండా జరిగింది. సమాజం కోసం బలవంతంగా నేను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని ఆమె అన్నారు.

అమలాపాల్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ది గోట్ లైఫ్ లెవెల్ క్రాసింగ్ అనే సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం దాంపత్య జీవితానికే పూర్తి సమయం కేటాయిస్తున్నట్టు కనిపిస్తున్నది. కొడుకు ఇలాయ్‌తో ఆడుతూ పాడుతూ ఉండే వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు.

Read more about: amala paul jagat desai al vijay
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X