మాజీ భర్త రెండో పెళ్లి తర్వాత... రహస్యం బయట పెట్టిన అమలా పాల్!

Recommended Video

Amala Paul Opens Up About Her Personal Life Issues || Filmibeat Telugu

తెలుగు, తమిళ మీడియాలో గత వారం పది రోజులుగా హీరోయిన్ అమలా పాల్ పేరు మారుమ్రోగిపోతోంది. ఈ మలయాళ బ్యూటీ తన తర్వాతి చిత్రం 'ఆడై'(తెలుగులో 'ఆమె')లో నగ్నంగా నటించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. జులై 19న ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయారు.

అమలా పాల్ మాజీ భర్త, తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ ఇటీవల ఒక డాక్టర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశం కూడా ఈ బోల్డ్ బ్యూటీ గురించి హాట్ టాప్ రన్ అవ్వడానికి మరో కారణం. ఈ నేపథ్యంలో 'ఆమె' మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న అమలా పాల్‌కు ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఇపుడు అమలా పాల్ జీవితంలో ఎవరు లేరా?

ఇపుడు అమలా పాల్ జీవితంలో ఎవరు లేరా?

విజయ్‌తో విడాకుల తర్వాత అమలా పాల్ తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టారు. భర్తతో విడిపోయిన తర్వాత మరింత ఫ్రీడం దొరకడంతో ‘ఆమె' లాంటి బోల్డ్ సినిమాల్లో నగ్నంగా నటించడానికి కూడా వెనకాడటం లేదు. గత రెండేళ్లుగా ఒంటరిగా ఉంటున్న అమలా పాల్ జీవితంలోకి మరో మగాడు ఎవరూ రాలేదా? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది.

రహస్యం బయట పెట్టిన అమలా పాల్!

రహస్యం బయట పెట్టిన అమలా పాల్!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమలా పాల్... తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన రహస్యం బయట పెట్టారు. తాను ఒక వ్యక్తితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకున్నారు. అయితే అతడు సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదని తెలిపారు.

పెళ్లి గురించి ఆలోచించడం లేదు

పెళ్లి గురించి ఆలోచించడం లేదు

ఎఎల్ విజయ్ మరో వివాహం చేసుకున్న నేపథ్యంలో... మీరు మరో పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు అమలా పాల్ రియాక్ట్ అవుతూ తనకు పెళ్లి గురించిన ఆలోచన లేదని, ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కెరీర్ మీదనే ఉందన్నారు. తన జీవితం చాలా సంతోషంగా ఉందని అమె స్పష్టం చేశారు.

అమలా పాల్-ఎఎల్ విజయ్

అమలా పాల్-ఎఎల్ విజయ్

2011లో ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం (తెలుగులో విక్రమ్ హీరోగా వచ్చిన 'నాన్న') షూటింగులో అమలా పాల్, విజయ్ మధ్య ప్రేమ చిగురించింది. తన తర్వాతి చిత్రం 'తలైవా'(తెలుగులో 'అన్న') చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నాడు. 2014లో పెళ్లాడిన ఈ జంట 2017లో విడిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X