twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంత బరి తెగింపా.. మహిళలంటే అంత అలుసా? బికినీ ట్రోలింగ్‌పై ఘాటుగా అమలాపాల్

    |

    దక్షిణాదిలో అందాల తార అమలా పాల్ బికినీ ఫోటోలు దేశవ్యాప్తంగా అన్ని రకాల మీడియాలో హల్‌చల్ చేశాయి. ఆమె అందాల ఆరబోత ప్రత్యేక ఆకర్షణగానే కాకుండా గ్లామర్ ట్రీట్ చర్చనీయాంశంగా మారింది. అయితే తన బికినీ అందాల ప్రదర్శనను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై ఘాటుగా స్పందించింది. ఒకరి ఇష్టాలను మరొకరిపై రుద్దడం సరికాదు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. అయితే బికినీ ఫోటోలపై చేసిన ట్రోలింగ్ గురించి అమలా పాల్ ఏమని స్పందించారంటే..

    మరీ బోల్డుగా అమలా పాల్

    మరీ బోల్డుగా అమలా పాల్

    అమలాపాల్ నటించే విషయంలోను, అలాగే మాటతీరు, ప్రవర్తన కూడా బోల్డ్‌గానే ఉంటుంది. ఒకరి కోసం తన అభిరుచిని, అలవాట్లను, కట్టుబాట్లను మార్చుకోని పలు సందర్భాల్లో ఈ బ్యూటీ స్పష్టం చేసింది. తన మాటల కట్టుబడి ఉంటూ ఇటీవల ఓ వెకేషన్‌కు వెళ్లిన అమలా పాల్ బోహో అనే ప్రత్యేక బికినీలో అందాలను పంచేసేంది.

    ఎరుపు చారల బికినీ టాప్, స్ల్పిట్ లహెంగాలో

    ఎరుపు చారల బికినీ టాప్, స్ల్పిట్ లహెంగాలో

    అమలా పాల్ ధరించిన ఎరుపు, బంగారు పూతలో ఉండే టాప్ బికినీ, అలాగే స్ల్పిట్ లహెంగాలో ఆమె అందాల అదరహో అనిపించాయి. అయితే ఆమె అందానికి కొందరు ఫిదా అయితే.. గిట్టని వాళ్లు ఏంటి ఈ బరితెగింపు అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. రకరకాల కామెంట్లు చూసి మనస్తాపానికి గురయ్యానని ఆమె తన బాధను పంచుకొన్నారు. తనకంటూ ఓ టేస్ట్ ఉండగా.. తన జీవితాన్ని తాను అనుభవించడం తప్పా అంటూ అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

    నాకు నచ్చిన విధంగా దుస్తులు ధరిస్తా

    నాకు నచ్చిన విధంగా దుస్తులు ధరిస్తా

    అయితే తన వ్యక్తిగత జీవితంపై దారుణంగా కామెంట్స్ చేసిన నెటిజన్లపై ఘాటుగా అమలా పాల్ స్పందించారు. నాకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నాకు ఉంది. మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొనసాగించే దుష్ట సంస్కృతికి ముగింపు పలకాలి. మహిళలు తనకు నచ్చినట్టు, తనకు నచ్చిన విధంగా దుస్తులు ధరించే హక్కు ఉంది. మహిళలు ఇలా డ్రస్సులు ధరించాలి. అలా ధరించాలి అంటూ నియంతల్లా ఆంక్షలు విధించే హక్కు ఎవరికి లేదు అంటూ అమలా పాల్ గట్టిగా బదులిచ్చారు.

    సోషల్ మీడియాలో దాడుల ఆపేయండి

    సోషల్ మీడియాలో దాడుల ఆపేయండి

    సినీ తారలపై, లేదా మహిళలను టార్గెట్‌గా చేసుకొని ట్రోలింగ్ చేసే సంస్కృతి బాగా పెరిగిపోతుంది. ప్రతీ ఒక్కరికి కొన్ని మనోభావాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని నెటిజన్ల జాగ్రత్తగా మసలుకోవాలి. అంతేగానీ నోటికి ఇష్టం వచ్చినట్టు ఎదుటివారిని దూషిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం చాలా దారుణం. ప్రతీ ఒక్కరికి ఓ పరిధి ఉంటుంది. ఆ పరిధిలో జీవించే హక్కు వారి స్వేచ్ఛకు వదిలేయాలి. అంతేగానీ ఎదుటివారికి పరిమితులు విధించడం సమంజసం కాదు అంటూ అమలా పాల్ సోషల్ మీడియాలో స్పందించారు.

    Recommended Video

    Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
    అమలా పాల్ కెరీర్ ఇలా..

    అమలా పాల్ కెరీర్ ఇలా..


    ఇక అమలాపాల్ కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్ తర్వాత పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వినోద్ కేఆర్ దర్శకత్వంలో అధో అంధా పరవై పోలా చిత్రంలో, ఆడు జీవితం చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌తో కలిసి, కంచా, తన్‌మంత్రా, ప్రణయమ్ చిత్రాలను రూపొందించిన బ్లెస్సీ చిత్రంలో అమలాపాల్ నటిస్తున్నారు.

    English summary
    Amala Paul sharp reactions on trolling her boho bikini dressing. she wrote, She would lead her life the way she wants. Therefore stop targeting women on social media. A woman dresses as per her wish and her own choice, no one has any business dictating about a girl's dressing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X