అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: బీచ్‌లో బికినీతో అందాలు మొత్తం కనిపించేంత ఘాటుగా!

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతుంటారు. అందులో ఆకట్టుకునే అందం.. అద్భుతమైన టాలెంట్ ఉన్నా కొంత మంది అంతగా రాణించలేరు. ఒకవేళ తమలోని అన్ని కోణాలనూ నిరూపించుకున్నప్పటికీ అంతగా అవకాశాలను అందుకోలేరు. అలాంటి వారిలో అమలా పాల్ ఒకరు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే సత్తా చాటిన ఆ భామ.. సుదీర్ఘ కాలం పాటు అవకాశాలను అందుకోలేకపోయింది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులే ఆమెకు ఈ పరిస్థితిని కల్పించాయనే చెప్పాలి. ఇలాంటి సమయంలో అమలా పాల్ కొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో వదిలింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా పరిచయం.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ

అలా పరిచయం.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ

అమలా పాల్ 'నీల తామర' అనే మలయాళ సినిమా ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఎంటరై కొన్ని సినిమాల్లో నటించింది. ఆ రెండు చోట్లా సక్సెస్‌ను అందుకున్న ఆమెకు తెలుగులో మాత్రం నిరాశే ఎదురైంది. ఇక్కడ అమలా పాల్ నటించిన సినిమాలు 'బెజవాడ', 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' 'జెండాపై కపిరాజు' హిట్ అవలేదు.

దర్శకుడితో పెళ్లి.. విడాకులు తీసుకుని

దర్శకుడితో పెళ్లి.. విడాకులు తీసుకుని

చేతి నిండా ఆఫర్లతో కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలోనే అమలా పాల్.. తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడింది. చాలా రోజుల పాటు సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడిపిన ఈ ఇద్దరూ.. అది బహిర్గతం కావడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకుని షాకిచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.

నూలుపోగు లేకుండా నటించిన బ్యూటీ

నూలుపోగు లేకుండా నటించిన బ్యూటీ

వివాహం చేసుకున్న తర్వాత అమలా పాల్ సినిమాల్లో నటించలేదు. విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం ఆమె పలు మూవీల్లో నటించింది. ఈ క్రమంలోనే ఆ మధ్య 'ఆమె/అడై' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నటించింది. దీంతో అమలా పాల్ చేసిన సాహసం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది.

 రెండో వివాహం అంటూ పుకార్లు షికార్లు

రెండో వివాహం అంటూ పుకార్లు షికార్లు

కొంత కాలంగా అమలా పాల్ ఏం చేసినా హైలైట్ అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె యువ సింగర్ భరిందర్ సింగ్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్త వైరల్ అయింది. అంతేకాదు, కొన్ని ఫొటోలు బయటకు రావడంతో వాళ్లిద్దరూ వివాహం చేసకున్నారని ప్రచారం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో అమలా పాల్ ఆ వార్తలను ఖండించడంతో అవి ఆగిపోయాయి.

వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ.. అదిరిపోయింది

వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ.. అదిరిపోయింది

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఓటీటీ సంస్థ ఆహా కోసం అమలా పాల్ 'కుడి ఎడమైతే' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. 'యూటర్న్' ఫేం పవన్ కుమార్ దీనికి దర్శకుడు. టైమ్ లాప్స్ అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ సిరీస్‌లో ఆమెతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలను పోషించారు. ఈ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

సోషల్ మీడియాలో అమలా పాల్ ఎంతో యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. తద్వారా ఎప్పుడూ ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగింది.

Recommended Video

Harbhajan Singh లో ఇంత గొప్ప సింగర్ ఉన్నాడా.. రోజా మూవీ లో పాట పాడిన బజ్జీ
బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన హీరోయిన్

బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన హీరోయిన్

సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే అమలా పాల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బీచ్‌లో బికినీతో సందడి చేస్తోంది. ఈ ఫొటోల్లో అమలా పాల్ అందాలు మొత్తం నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వస్తోంది. ఫలితంగా ఇవన్నీ తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X